Ananth Ambani : వివాహమైన మూడు రోజులకే వివాదంలో కూరుకుపోయిన అనంత్ అంబానీ.. ఇంతకీ ఏం జరిగిందంటే..

సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్న క్రమంలో కొంతమంది మాయగాళ్లు దానిని ఉపయోగించి చెత్త పనులు చేస్తున్నారు. ఆ పనులకు సమాజంలో పేరు పొందిన వ్యక్తులను ఉపయోగించుకుంటున్నారు. వారికి తెలియకుండానే ఇలాంటి పనులు చేస్తూ.. వారి వ్యక్తిగత హోదాకు ఇబ్బంది కలగజేస్తున్నారు. డీప్ ఫేక్ టెక్నాలజీని ఉపయోగించుకొని నకిలీ వీడియోలను సృష్టిస్తున్నారు

Written By: Bhaskar, Updated On : July 17, 2024 2:05 pm
Follow us on

Ananth Ambani : సాంకేతిక పరిజ్ఞానం రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతోంది. దీని ఆధారంగానే కొత్త కొత్త యాప్స్ రూపొందుతున్నాయి. అయితే వీటిని మంచికి వాడుకుంటే పెద్దగా ఇబ్బంది ఉండదు. కానీ వీటి ద్వారా కొంతమంది చెడు పనులు చేస్తున్నారు. తాచెడ్డ కోతి వనమెల్ల చెరిచినట్టు.. ఆ తరహా వ్యక్తులు యాప్స్ తో చెత్త పనులు చేస్తూ సమాజంలో గుర్తింపు పొందిన వ్యక్తులను బదనాం చేస్తున్నారు. అందులో అనంత్ అంబానీ, నీతా అంబానీ, గౌతమ్ ఆదాని, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వంటి వారు ఉండడం విశేషం.

ఇంతకీ ఏం జరిగిందంటే..

సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్న క్రమంలో కొంతమంది మాయగాళ్లు దానిని ఉపయోగించి చెత్త పనులు చేస్తున్నారు. ఆ పనులకు సమాజంలో పేరు పొందిన వ్యక్తులను ఉపయోగించుకుంటున్నారు. వారికి తెలియకుండానే ఇలాంటి పనులు చేస్తూ.. వారి వ్యక్తిగత హోదాకు ఇబ్బంది కలగజేస్తున్నారు. డీప్ ఫేక్ టెక్నాలజీని ఉపయోగించుకొని నకిలీ వీడియోలను సృష్టిస్తున్నారు. పైగా వాటిని ఆన్ లైన్ లో పోస్ట్ చేస్తున్నారు. అలా సోషల్ మీడియాలో ఒక వీడియో ట్రెండ్ అవుతోంది. ఈ వీడియోలో ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, ఆయన భార్య నీతా అంబానీ, ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ ఆదాని, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వంటి వారు ఏవియేటర్ అనే గేమింగ్ యాప్ ను ప్రమోట్ చేస్తున్నారు. వాస్తవానికి పై వ్యక్తులు ఎలాంటి ప్రకటనల్లో కనిపించరు. పైగా సామాన్యుల జేబులు గుల్ల చేసే గేమింగ్ యాప్స్ ను అస్సలు ప్రమోట్ చేయరు. కానీ కొంతమంది మాయగాళ్లు డీప్ ఫేక్ టెక్నాలజీ ద్వారా అనంత్ అంబానీ, నీతా అంబానీ, గౌతమ్ అదాని, యోగి ఆదిత్యనాథ్ ముఖాలను ఉపయోగించి డీప్ ఫేక్ వీడియోలను సృష్టిస్తున్నారు. ఆ వీడియోలో వారి ద్వారా గేమింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్నట్టు ప్రకటనలు రూపొందించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.

ఇలా వెలుగులోకి..

కొన్ని సోషల్ మీడియా వేదికలలో అనంత్ అంబానీ ఓ గేమింగ్ యాప్ ను ప్రమోట్ చేస్తున్నట్టు వీడియోలు చక్కర్లు కొట్టాయి. వాస్తవానికి అది ఫేక్ వీడియో అయినప్పటికీ.. డీప్ ఫేక్ టెక్నాలజీ ఉపయోగించి వీడియోను రూపొందించడంతో.. అది నిజమైన వీడియో లాగానే అనిపించింది. అచ్చం అనంత్ అంబానీ ముఖాన్ని, అతడి గొంతును సృష్టించారు. గేమింగ్ యాప్ ను అతడు ప్రమోట్ చేస్తున్నట్టు వీడియోను సృష్టించి.. సామాన్యుల జేబులను కొల్లగొట్టారు. అనంత్ అంబానీ పేరును ఉపయోగించుకొని.. దొడ్డిదారిన సొమ్ము చేసుకున్నారు.

అనంత్ అంబానీ మాత్రమే కాదు..

అనంత్ అంబానీ మాత్రమే కాదు.. అతడి తల్లి నీతా అంబానీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఆదాని గ్రూప్ వ్యవస్థాపకుడు గౌతమ్ అదానీ లతో కూడా ఇలాంటి వీడియోలను రూపొందించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వారితో కూడా గేమింగ్ యాప్స్ ను ప్రమోట్ చేయిస్తున్నట్టు వీడియోలను సృష్టించారు.. డీప్ ఫేక్ టెక్నాలజీని ఉపయోగించడం వల్ల అవి నిజమైన వీడియో లాగా కనిపిస్తున్నాయి. పై వాళ్లంతా సమాజంలో పేరుపొందిన వ్యక్తులు కావడంతో.. ఆ ప్రకటనలు చూసిన వారంతా ఆ గేమింగ్ యాప్స్ లో బెట్టింగ్ కాసి.. జేబులు గుల్ల చేసుకున్న ఘటనలు పెరిగిపోయాయని తెలుస్తోంది. పోలీసులకు ఇటీవల ఈ తరహా ఫిర్యాదులు ఎక్కువ కావడంతో వారు సోషల్ మీడియా మీద ప్రధానంగా దృష్టి సారించారు.

కేసుల నమోదు

సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేస్తున్న ఐడీలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఆ వీడియోలు పెడుతున్న వ్యక్తులను సాంకేతిక పరిజ్ఞానం ద్వారా త్వరలో గుర్తిస్తామని చెబుతున్నారు. ఈ తరహా మోసాలకు ఎవరైనా పాల్పడితే చర్యలు తీసుకుంటామని.. సోషల్ మీడియాలో కనిపించే ప్రతి గేమింగ్ యాప్ లు మోసపూరితమైన వని.. ప్రజలెవరూ అందులో బెట్టింగ్ కాయొద్దని పోలీసులు సూచిస్తున్నారు. ఎవరైనా ఇలాంటి తప్పుడు ప్రకటనలతో మోసం చేసేందుకు ప్రయత్నిస్తే.. వారి వివరాలను తమ దృష్టికి తీసుకురావాలని పోలీసులు ప్రజలకు సూచిస్తున్నారు.