HomeNewsCyber Fraud: మంచోడు అనుకుంది.. అడ్డంగా బుక్కయిన బ్యుటీషియన్‌.. చివరకు ట్విస్ట్‌!

Cyber Fraud: మంచోడు అనుకుంది.. అడ్డంగా బుక్కయిన బ్యుటీషియన్‌.. చివరకు ట్విస్ట్‌!

Cyber Fraud: కాదేదీ మోసానికి అనర్హం అన్నట్లుగా మారిపోయాయి నేటి రోజులు. నిరుద్యోగం పెరగడం.. సెల్‌ఫోన్, సాంకేతిక టెక్నాలజీ అందుబాటులోకి రావడం.. సరదాగా అలవాటైన గేమ్స్‌లో డబ్బులు పెట్టి ఆడడం.. డబ్బుల కోసం తప్పుడు మార్గాలు వెతకడం నేటి రోజుల్లో సర్వసాధారణం అయ్యాయి. ఇక ఎక్కడో ఉండి మనకు లిక్‌ పంపించి.. ఫోన్‌ చేసి.. మనకు తెలియకుండానే మన ఖాతాల్లోని డబ్బులు కొట్టేస్తున్నారు కొందరు కేటుగాళ్లు. కొందరు లోన్‌ యాప్‌ల పేరుతో రుణాలు ఇచ్చి తిరిగి ఇవ్వని వారి జీవితాలతో ఆడుకుంటున్నారు. ఇక కొందరు నమ్మించి నట్టేట ముంచుతున్నారు. మన ఫొటోలను మార్ఫింగ్‌ చేసి.. బ్లాక్‌మెయిల్‌ చేసి మన నుంచే డబ్బులు లాగుతున్నారు. తాజాగా మహారాష్ట్రకు చెందిన ఓ బ్యుటీషియన్‌ ఇలాగే మోసపోయింది. తనను బ్లాక్‌మెయిల్‌ చేస్తున్న వ్యక్తికి రూ.50 వేలకుపైగా చెల్లించింది. అయినా వేధింపులు ఆగకపోవడంతో చివరకు పోలీసులను ఆశ్రయించింది.

ఏం జరిగిందంటే..
పురుషులందు పుణ్య పురుషులు వేరు అని వేమన ఎప్పుడో చెప్పారు. కానీ నమ్మకం అనేది ఒకటి ఉంది కదా.. అదే మనుషుల్ని, ఇతరులను నమ్మేలా చేస్తుంది. ఆ నమ్మకాన్నే కొందరు కేటుగాళ్లు తమకు పెట్టుబడిగా మార్చుకుంటున్నారు. మనుషులంతా మంచివాళ్లే అని నమ్మినవారు ఇలాంటి మోసగాళ్ల చేతిలో మోసపోతున్నారు. నేటి రోజుల్లో అతి తెలివి ఉండేవాళ్లతో అప్రమత్తంగా ఉండాలి. వాళ్లు అడ్డంగా ముంచడంలో ఎక్స్‌పర్ట్స్‌. పైకి కనిపించే వ్యక్తుల అసలు స్వభావాలను గుర్తించక పోవడంతో మహారాష్ట్రకు చెందిన 34 ఏళ్ల బ్యుటీషియన్‌ రూ.50 వేలు సమర్పించుకుంది. సదరు బ్యుటీషియన్‌కు జులైలో ఓ గేమింగ్‌ యాప్‌లో ఓ వ్యక్తి పరిచయం అయ్యాడు. ఆమె బ్యూటీపార్లర్‌ నడుపుతూ.. ఖాళీ ఉన్నప్పుడు గేమ్స్‌ ఆడేది. ఆమెకు తోడుగా అటువైపు నుంచి ఓ వ్యక్తి గేమ్‌ ఆడేవాడు. అలా అతనితో గేమ్స్‌ ఆడుతూ.. అప్పుడప్పుడూ గెలుస్తూ ఉండేది. అలా ఆమెతో పరిచయం ఏర్పరచుకున్న అతను.. మెల్లగా ఫోన్‌ నంబర్‌ తీసుకున్నాడు. తర్వాత వాట్సాప్‌ చాటింగ్‌ మొదలుపెట్టాడు.

సోషల్‌ మీడియా ఫొటోలు సేకరించి..
ఆమె బ్యూటీషియన్‌ కావడంతో.. ఫేస్‌బుక్‌ పేజీ కలిగివుంది. అందులో తన ఫొటోలను పోస్ట్‌ చేస్తోంది. తన బ్యూటీ పార్లర్‌ గురించి కూడా వివరాలు ఇస్తూ ఉంది. ఈ విషయం ఓ రోజు అతనికి తెలిసింది. వెంటనే అతడు ఆ పేజీలోకి వెళ్లాడు. ఆమె ఫొటోలను తన ల్యాప్‌టాప్‌లో సేవ్‌ చేసుకున్నాడు. వాటిలో కొన్ని ఫొటోలను న్యూడ్‌గా మార్ఫింగ్‌ చేశాడు. తర్వాత ఆమె వాట్సాప్‌ నంబర్‌కి వాటిని పంపించాడు. తనకు మనీ ఇవ్వకపోతే.. వాటిని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తానని బ్లాయ్‌మెయిల్‌ చేయడం మొదలు పెట్టాడు. అవి మార్ఫింగ్‌ అయిని తెలిసి కూడా సదరు బ్యుటీషియన్‌ బయటకు వస్తే పరువు పోతుందని, వ్యాపారం దెబ్బతింటుందని భయపడింఇ. అతను అడిగినట్లు వేర్వేరు ఫోన్‌ నంబర్లకు డబ్బులు పంపింది. ఇలా రూ.55,200 వరకు చెల్లించింది. ఇక తనను వదిలేయాలని వేడుకుంది.

మళ్లీ వేధింపులు..
వదిలేస్తానని నమ్మించిన చీటర్‌… డబ్బులు అయిపోగానే మళ్లీ వేధించడం మొదలు పెట్టాడు. దీంతో ఇక ఈ వేధింపులు ఆగవని గ్రహించిన బ్యుటీషియన్‌.. ఇలాంటి వాళ్లకు బుద్ధి చెప్పాల్సిందే అని నిర్ణయించుకుంది. ధైర్యంగా అంబోలీ పోలీసులను కలిసింది. పోలీసులు ఆమె చెప్పిన ప్రకారం.. దర్యాప్తు చెయ్యగా.. నిందితుడు.. ఇషాంత్‌ రాజ్‌పుత్, రాకీ శర్మ అనే రెండు రకాల పేర్లతో ఉనికిలో ఉన్నట్లు గుర్తించారు. అతడి కోసం గాలిస్తున్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular