
హైదరాబాద్ వ్యాక్సిన్ హబ్ గా ఉందని మంత్రి కేటీఆర్ చెప్పారు. అయినా వ్యాక్సిన్ కోసం గ్లోబల్ టెండర్లు పిలవాల్సివచ్చిందన్నారు. వ్యాక్సిన్ పై కేంద్రం కలగజేసుకోకపోవడం వల్లే కొరత ఏర్పడిందని కేటీఆర్ విమర్శించారు. కోటి వ్యాక్సిన్ల కోసం ప్రభుత్వం టెండర్లు పిలిచిందని తెలిపారు. జూడాలు సమ్మె చేయడానికి ఇది సరైన సమయం కాదని చెప్పారు. జూడాలు సమ్మె విరమించాలని లేకుంటే తదుపరి చర్యలుంటాయని కేటీఆర్ హెచ్చరించారు.