Chiranjeevi-Jagan: సాధారణ ప్రేక్షకులు ఎక్కువ ధర పెట్టి స్టార్ హీరోల సినిమా టిక్కెట్లను కొనలేకపోతున్నారని ‘జగన్’ బాగా బెంగ పెట్టుకుని, సినిమా టిక్కెట్ ధరల్ని అందుబాటులోకి తేవాలని తెగ కష్టపడుతున్నారు. ఇదే విషయాన్ని ఇలాగే ఇన్ని రోజులూ నీలి మీడియా ముసలి కన్నీరు కార్చింది. కానీ, అసలు బాగోతం ఇప్పటికీ బయట పడింది. జగన్ గొప్ప మనసుతో ఆలోచించింది సినిమా ప్రేక్షకుల శ్రేయస్సు కోసం కాదు, తన పార్టీ దిగువస్థాయి క్యాడర్ ఆర్థిక పురోగతి గురించి.
అవును, మీరు విన్నది నిజమే. ఇప్పుడు ప్రతి జిల్లాలో పెద్ద సినిమాల బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు మామూళ్లు ఇవ్వాలి. ఈ విషయం నిన్నటి వరకూ సినిమా వాళ్ళు కూడా పెద్దగా ఆలోచించలేదు. కానీ అఖండ డిస్ట్రిబ్యూటర్లకు ఎదురైనా పరిస్థితులు గమనించాక, మొత్తానికి జగన్ అసలు సినిమా రంగు బయట పడింది. అఖండ బయ్యర్లు జగన్ పార్టీ నాయకులకు అదనపు ఖర్చు చేయాల్స వస్తోంది.
ఎందుకు ఈ అదనపు ఖర్చు అంటే..? అఖండ టికెట్లను అదనపు రేట్లకు అమ్ముకోవాడనికి. మరి అలా అమ్ముకున్నా ఎమ్మార్వోలు, ఆర్డీవోలు, పోలీస్ డిపార్ట్ మెంట్ పట్టించుకోకుండా ఉండాలి కదా. అలా ఉండాలి అంటే.. ప్రభుత్వం మద్దతు ఉండాలి కదా. మరి ప్రభుత్వం మద్దతు ఉండాలి అంటే.. ముందుగా చేయాల్సిన పని ఏమిటి ? జగన్ పార్టీ నాయకులకు మామూళ్లు సమర్పించుకోవడమే.
చివరకు, ఆ డబ్బు అంతా జగన్ పార్టీ కోసం పని చేసే నీలి కార్యకర్తల జేబుల్లోకి పోతుంది. ఇది జగన్ అసలు ఆలోచన. పాపం ఇది తెలియక, ఇన్ని రోజులూ చిరంజీవి రిక్వెస్ట్ ల మీద రిక్వెస్ట్ లు చేసుకుంటూ జగన్ పై విమర్శలు చేయలేక సైలెంట్ గా ఉన్నారు. మరి ఇప్పుడు నిజం అర్ధం అయ్యాక, చిరంజీవి ఎలా రియాక్ట్ అవుతారో ? ఎలా రియాక్ట్ అయినా తన ఆచార్య రిలీజ్ కి కూడా మామూళ్లు ఇవ్వాల్సిందే.
Also Read: సీఎం జగన్ విజ్ఞప్తిని ఆ తల్లులు పట్టించుకుంటారా?
కాకపోతే, జగన్ ను ఇలాగే రిక్వెస్ట్ చేసుకుంటూ.. జగన్ చేసే పనులు నచ్చకపోయినా పైకి మెచ్చుకుంటూ ముందుకు పోతే.. చిరంజీవి ఇవ్వాల్సిన మామూళ్లలో జగన్ కొంతవరకు తగ్గించే ఆలోచన చేస్తాడు. అంతే గానీ, మామూళ్లు మాత్రం అందరూ ఇవ్వాల్సిందే.
అన్నట్టు అదనపు షో లకు కూడా మరో రేట్లు ఉన్నాయి. ఎన్ని స్పెషల్ షోలు వేసినా సైలంట్ గా ఉండటానికి ప్రత్యేక రేట్లను పెట్టే ఆలోచనలో లోకల్ వైసీపీ నాయకులు చర్చలు జరుపుతున్నారు.
Also Read: జగన్ ను నడిపించేది వారేనట..