Ravichandran Ashwin : ఐపీఎల్ లో అతడు వచ్చే సీజన్లో ఆడతాడని కుటుంబ సభ్యులు క్లారిటీ ఇచ్చారు.. ప్రస్తుతం ఆస్ట్రేలియా లో బోర్డర్ గవాస్కర్ సిరీస్ లో ఉన్న అతడు.. మిగతా రెండు టెస్టులు ముగిసిన తర్వాత స్వదేశానికి వస్తాడు. ఆ తర్వాత కొద్దిరోజులు కుటుంబంతో గడిపి.. అనంతరం వ్యాఖ్యాత అవతారం ఎత్తుతాడని తెలుస్తోంది. రవిచంద్రన్ అశ్విన్ రిటర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో.. అతడికి బిసిసిఐ ఎటువంటి ప్రయోజనాలు అందిస్తుందనే విషయంపై చర్చ మొదలైంది. అశ్విన్ కు బీసీసీఐ నిబంధనల ప్రకారం ప్రతినెల 70 వేల పెన్షన్ లభిస్తుంది. బీసీసీఐ నిబంధనల ప్రకారం ఫస్ట్ క్లాస్ క్రికెట్లో కనీసం 25 మ్యాచ్ లు ఆడిన ఆటగాళ్లకు పెన్షన్ లభిస్తుంది. 2022 వరకు తక్కువ మొత్తంలోనే ప్లేయర్లకు పెన్షన్ వచ్చేది. అయితే బీసీసీఐ ఈ విధానంపై సమీక్ష నిర్వహించింది. 2022 జూన్ 1 నుంచి ఆటగాళ్లకు చెల్లించే పెన్షన్ స్కీం లో బీసీసీఐ అనేక మార్పులు చేసింది. ఈ విధానం ప్రకారం 25 నుంచి 49 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు పాడిన ఆటగాళ్లకు ప్రతినెల 30 వేల వరకు పెన్షన్ వస్తుంది. గతంలో ఇది 15 వేలు మాత్రమే ఉండేది. ఇక 50 నుంచి 74 మ్యాచ్ లు ఆడిన ప్లేయర్లకు 45 వేల వరకు పెన్షన్ వస్తుంది. 75 పైగా మ్యాచులు ఆడిన ఆటగాళ్లకు ప్రతినెల 52,500 పెన్షన్ లభిస్తుంది. ఇంటర్నేషనల్ క్రికెట్లో 25 కంటే ఎక్కువ మ్యాచులు ఆడిన ఆటగాళ్లకు నెలకు 70 వేల వరకు పెన్షన్ లభిస్తుంది. గతంలో ఇది 50,000గా మాత్రమే ఉండేది. రవిచంద్రన్ అశ్విన్ ఐకంగా 10 6 టెస్ట్ మ్యాచ్ లు ఆడాడు. అతడికి 70 వేల వరకు పెన్షన్ వస్తుంది.
ఆ విధానానికి స్వస్తి
గతంలో ఆటగాళ్లకు బీసీసీఐ తక్కువ మొత్తంలో పెన్షన్ అందించేది. అయితే రిటైర్ అయిన ప్లేయర్ల లో కొంతమంది పరిస్థితి అత్యంత దయనీయంగా ఉండడం.. ఖర్చులు పెరగడంతో బీసీసీఐ ఈ నిర్ణయాన్ని పున:సమీక్షించింది. అందువల్లే పెన్షన్ ను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల ఆటగాళ్లకు ఎంతోకొంత ఆర్థిక వెసలు బాటు కలిగింది. అయితే వచ్చే రోజుల్లో పెన్షన్ ను మరింత పెంచుతామని బీసీసీఐ ప్రకటించింది. ఇక ఇటీవల కాలంలో సెంట్రల్ కాంట్రాక్ట్ ఫీజు కూడా పెంచింది. సెంట్రల్ కాంట్రాక్టు జాబితాను పలు విభాగాలుగా విభజించింది. ఏ గ్రేడ్ లో ఉన్న ఆటగాళ్లకు ఒక విధంగా, బీ గ్రేడ్ లో ఉన్న ఆటగాళ్లకు మరొక విధంగా, సీ, డీ, ఈ గ్రేడ్ లలో ఉన్న ఆటగాళ్లకు ఒక్కో విధంగా ఫీజులను ప్రకటించింది. రవిచంద్రన్ అశ్విన్ ఏ గ్రేడ్ లో ఉన్నాడు. అతడికి మెరుగైన మ్యాచ్ ఫీజు ను బీసీసీఐ ప్రకటించింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, బుమ్రా స్థాయిలో రవిచంద్రన్ అశ్విన్ ఫీజు అందుకున్నాడు. ఇప్పుడు అతడు రిటైర్మెంట్ ప్రకటించడంతో మెరుగైన పెన్షన్ అందుకోనున్నాడు