Natural Star Nani: టాలీవుడ్ నాచురల్ స్టార్‌గా ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు యూత్ ఆడియన్స్‌లోనూ మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు నాని. దర్శకుడు అవ్వాలనుకొని ఇండస్ట్రికి వచ్చిన నాని… అసిస్టెంట్ డైరెక్టర్ గా బాపు, శ్రీను వైట్ల వద్ద పనిచేశాడు. ఆతర్వాత అష్ట చమ్మా సినిమాతో హీరోగా పరిచయం అయ్యి తనదైన అనటనతో స్టార్ హీరో రేంజ్ కి ఎదిగాడు ఈ యంగ్ హీరో. సినిమాలతో పాటు సోషల్ మీడియా లోనూ యాక్టివ్ గా ఉనతాడు నాని. ఇండస్ట్రి లోని హీరోలతో కూడా సన్నిహిత సంబంధాలు కలిగి ఉంటాడు. ఈ మేరకు సినిమా అప్డేట్ ల సమయంలో, వారి పుట్టిన రోజుల నాడు విషెష్ ను వినూత్నంగా చెప్తాడు నాని.

ఇటీవల ప్రభాస్ బర్త్ డేకి నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాలని అనుకున్నాను ప్రభాస్ అన్నా. కానీ, చెప్పను అని నాని ట్వీట్ చేశారు. కాగా ఈరోజు నాని భార్య అంజనా పుట్టినరోజు సంధర్భంగా మరోసారి వినూత్నంగా విషెస్ చెప్పారు ఈ యంగ్ హీరో. “మదర్ ఆఫ్ డ్రాగన్, వైఫ్ ఆఫ్ పాండా … సెంటర్ ఆఫ్ అవర్ హోమ్ హ్యాపీ బర్త్ డే అంజనా యలవర్తి వుయ్ లవ్ యు” అని నాని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. స్నేహంగా మొదలైన వీరి బంధం ప్రేమగా మారి… ఆ తర్వాత వివాహ బంధంతో ఒక్కటి అయ్యారు. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. ఇక నాని ‘శ్యామ్ సింగ రాయ్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రం డిసెంబర్ 24 న విడుదల కానుంది. ఈ చిత్రంలో సాయి పల్లవి, కృతీ శెట్టి, మడోనా సెబాస్టియన్ హీరోయిన్లు గా నటిస్తున్నారు.