https://oktelugu.com/

BJP, MIM: పైకి కత్తుల కయ్యం.. లోపల తియ్యటి బెల్లం!! ఇదీ బీజేపీ-మజ్లీస్‌ తీరు

BJP, MIM: బీజేపీ, మజ్లిస్‌ రెండూ మతతత్వ పార్టీలని, అవసరమైనప్పుడల్లా రహస్య భాగస్వామ్యంతో ఎన్నికల బరిలో నిలుస్తాయని పొలిటికల్‌ సర్కిల్స్‌లో ఓ చర్చ ఉంది. ఇప్పుడది నిజం కాబోతున్నట్టు విశ్లేషకులు చెప్పుకుంటున్నారు. పైకి మజ్లిస్‌పైన బీజేపీ, బీజేపీపైన మజ్లిస్‌ పార్టీలు కత్తులు దూస్తున్నా లోపల మాత్రం అంతరంగిక ఒప్పందమేదో ఉన్నట్టు విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో ఉన్న 403 సీట్లలో మజ్లీస్‌ పార్టీ 100 స్థానాల్లో పోటీ చేయనున్నట్టు ఆ పార్టీ అధినేత అసదుద్దీన్‌ ఓవైసీ ప్రకటించడమే […]

Written By:
  • Neelambaram
  • , Updated On : November 23, 2021 / 04:11 PM IST
    Follow us on

    BJP, MIM: బీజేపీ, మజ్లిస్‌ రెండూ మతతత్వ పార్టీలని, అవసరమైనప్పుడల్లా రహస్య భాగస్వామ్యంతో ఎన్నికల బరిలో నిలుస్తాయని పొలిటికల్‌ సర్కిల్స్‌లో ఓ చర్చ ఉంది. ఇప్పుడది నిజం కాబోతున్నట్టు విశ్లేషకులు చెప్పుకుంటున్నారు. పైకి మజ్లిస్‌పైన బీజేపీ, బీజేపీపైన మజ్లిస్‌ పార్టీలు కత్తులు దూస్తున్నా లోపల మాత్రం అంతరంగిక ఒప్పందమేదో ఉన్నట్టు విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో ఉన్న 403 సీట్లలో మజ్లీస్‌ పార్టీ 100 స్థానాల్లో పోటీ చేయనున్నట్టు ఆ పార్టీ అధినేత అసదుద్దీన్‌ ఓవైసీ ప్రకటించడమే ఇందుకు నిదర్శనం.

    మజ్లిస్‌ పార్టీ… హైదరాబాద్‌లో పాతనగరంలో తిరుగులేని పార్టీ.. ఉన్న 10 ఎమ్మెల్యే స్థానాల్లోనూ వరుస విజయాలతో అక్కడ దూసుకుపోతున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇటీవల కాలంలో ఆ పార్టీ ముస్లిం జనాభా ఎక్కువగా ఉండే నగరాల్లో పాగా వేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ముస్లింల ఓటు మాత్రమే ఆశిస్తూ బరిలోకి దిగే పార్టీ- మజ్లిస్‌. ముస్లిం ఓటు బ్యాంకు గణనీయంగా ఉన్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌. ఈ నేపథ్యంలో అక్కడి ఎన్నికల్లో ఖచ్చితంగా వీరి ప్రభావం ఉంటుందని భావిస్తోంది. అయితే గతంలో అసదుద్దీన్‌ ఒవైసీ తీసుకున్న నిర్ణయాలన్నీ, ఇతర ప్రాంతాల్లో పోటీచేసే వ్యవహారాలన్నీ బీజేపీకి మేలు చేకూర్చడానికే జరుగుతోందన్న బలమైన ఆరోపణలున్నాయి.

    గతంలో గుజరాత్‌ ఎన్నికల్లో పోటీచేసినా, మహారాష్ట్ర ఎన్నికల్లో పోటీచేసినా.. ఇతర ప్రాంతాల్లో బరిలోకి దిగి తొడకొట్టినా.. మజ్లిస్‌ పార్టీ పోటీ వలన బీజేపీకి మాత్రమే అంతిమ ప్రయోజనం కలిగిందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ముస్లింలను ఖచ్చితంగా ప్రభావితం చేయగలిగే నేతగా అసదుద్దీన్‌ ఒవైసీ ఆయా ప్రాంతాల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటును, బీజేపీ వ్యతిరేక ఓటును చీల్చడానికి ఉపయోగపడుతున్నారే తప్ప.. వారిని ఓడించడానికి కాదనే విమర్శలున్నాయి. దానికి తగ్గట్టుగానే ప్రస్తుత ప్రకటన కూడా ఉంది.

    Also Read: Arvind Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ చేసిన పనికి అంతా అవాక్కు.. అతడు మాత్రం ఫిదా

    ఈసారి ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో బీజేపీకి పెద్దనష్టం వాటిల్లే ప్రమాదముందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఎన్నికల నేపథ్యంలోనే మోడీ ఓ అడుగు వెనక్కి తగ్గి మూడు రైతుచట్టాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారన్న ఆరోపణ ఉంది. ప్రజల్లో బీజేపీపైన అసహనం ఉన్న నేపథ్యంలో ఓవైసీ హఠాత్తుగా తెరపైకి వచ్చారు. ఏకంగా వంద స్థానాల్లో పోటీకి దిగుతాం అని వెల్లడించారు. నిజానికి యూపీలో బలంగా ఉన్న భాజపాయేతర పార్టీలతో పొత్తు పెట్టుకోకుండా ఎన్నికల్లో ఒవైసీ పోటీచేస్తే గనుక.. ఖచ్చితంగా బీజేపీకి లాభం జరుగుతుంది. నల్లేరుపై బండినడక లాగా.. చాలా సునాయాసంగా బీజేపీ అధికారంలోకి వచ్చేస్తుంది. గతానుభవాలు ఇదే చెబుతున్నాయి. ఒవైసీ అక్కడ మాయావతి సారథ్యంలోని బీఎస్పీతో పొత్తు పెట్టుకోవడానికి ప్రయత్నించారు కానీ కుదర్లేదు. అటు ఎస్పీతోనూ పొత్తు సాధ్యం కాని విషయం. అందుకే- ఒవైసీ విషయంలో ఆయన ప్రతి అడుగూ బీజేపీతో కుమ్మక్కయ్యే వేస్తుంటారంటే.. ఇలాంటి పరిణామాలు చూసి నమ్మాల్సిందే అని ప్రజలు అనుకుంటున్నారు.

    Also Read: Mudragada Chandrababu: మీ పతనం నా కళ్లతో చూడాలనే ఆత్మహత్య విరమించా.. చంద్రబాబు కన్నీళ్లపై ముద్రగడ పాత పగల కథేంటి?

    Tags