Heavy Rains in Telangana: వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. వరద ఉధృతి కొనసాగుతూనే ఉంది. జులై నెలలో ఇంతటి భారీ వర్షపాతం నమోదు కావడం గత పదేళ్లలో ఇదే ప్రథమం. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చెరువులు జలకళను సంతరించుకున్నాయి. కొన్ని మత్తళ్లు పోస్తున్నాయి. కొన్ని తెగిపోవడంతో నీరంతా వృథాగా పోతోంది. మొత్తానికి రాష్ర్టవ్యాప్తంగా వానలు దండిగా పడుతున్నాయి. చాలా చోట్ల రహదారులు తెగిపోయి రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా 370 ప్రాంతాల్లో భారీ వర్షాలు, 200 ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు పడ్డాయి. కాళేశ్వరంలో అత్యధికంగా 19 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో అత్యధిక వర్షాలు పడినట్లు తెలుస్తోంది. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వర్షాల ధాటికి జనజీవనం స్తంభించిపోయింది. ఎటు వెళ్లలేని పరిస్థితి. ఇరవై నాలుగు గంటలు ఒకటే వాన. దీంతో ప్రజలు బయటకు రావడం లేదు. రోడ్లన్ని బోసిపోతున్నాయి.
Also Read: YCP Plenary 2022: ఆ అనుమానం ప్లీనరీతో పటాపంచలైంది.. వైసీపీలో పెరిగిన దీమా
వర్షాలతో వాణిజ్య సముదాయాలు ఖాళీగానే దర్శనమిచ్చాయి. హైదరాబాద్ తో పాటు ఇతర నగరాల్లో జనజీవనం కనిపించలేదు. ఇళ్లకే పరిమితమయ్యారు. చాలా ప్రాంతాల్లో బస్సుల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రోడ్లు తెగిపోయాయి. చెరువులు బుంగలు పడ్డాయి. దీంతో నీరంతా వృథాగా పోయింది. చాలా చోట్ల వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వానలకు జనమంతా అతలాకుతలం అవుతున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా సుమారు 43 వేల చెరువులు ఉన్నాయి. ఇందులో 8 వేల చెరువుల్లో మత్తడి దూకుతున్నాయి. 15 వేల చెరువులు యాభై శాతానికి పైగా నిండాయి. దీంతో రాష్ర్టమంతా జలకళ సంతరించుకుంది. రాజన్న సిరిసిల్ల, నిజామాబాద్, ములుగు సర్కిళ్లలో ప్రాజెక్టులకు గండ్లు పడ్డాయి. 21 చెరువులకు బుంగలు పడినట్లు తెలుస్తోంది. దీంతో రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురవడంతో చెరువులు, కుంటలు పొంగిపొర్లుతున్నాయి. మిషన్ కాకతీయకు ముందుతో పోల్చితే ఈ సారి నష్టం తక్కువగానే ఉన్నట్లు అధికారులు తెలిపారు.
సాధారణ వర్షపాతం 200 మి.మీటర్లు కాగా ఈసారి 391 మి.మీటర్ల వర్షపాతం నమోదు కావడం గమనార్హం. నిజామాబాద్ లో 162 శాతం అధిక వర్షపాతం నమోదైంది జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 160, ములుగులో 147, మహబూబాబాద్ లో 144, రాజన్న సిరిసిల్లలో 131, కరీంనగర్ 129, జగిత్యాల, మేడ్చల్ జిల్లాల్లో 123 శాతం మేర వర్షపాతం నమోదైనట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. కుమురం భీంలో 107 శాతం, అత్యల్పంగా జోగులాంబలో 8, వికారాబాద్ లో 32 మి.మీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
Also Read:Vijayashanti- KCR: కేసీఆర్ కు విజయశాంతి అంటే ఎందుకు ప్రత్యేకమంటే