2008 Ahmedabad Serial Blast Case: దేశంలో మరో సంచలన తీర్పు వెలువరించింది కోర్టు. 2008 పేళుళ్లకు సంబంధించిన కేసులో 38 మందికి ఉరిశిక్ష విధిస్తూ నిర్ణయం తీసుకోవడం సంచలనం కలిగించింది. ఇంత మందికి ఉరిశిక్ష విధించడం ఇదే తొలిసారి. కానీ మనుషుల ప్రాణాలతో చెలగాటం ఆడితే ఎంతటి వారైనా శిక్షార్హులేనని తెలుస్తోంది. అహ్మదాబాద్ పేలుళ్లలో 56 మంది ప్రాణాలు కోల్పోగా దాదాపు 200 మంది గాయపడ్డారు. 2008 జులై 26న 70 నిమిషాలలో 21 చోట్ల బాంబులు పేలాయి. దీంతో భారీగా ప్రాణనష్టం సంభవించింది. దీంతో ఈ చర్యను దారుణమైన చర్యగా అభివర్ణించింది.

అహ్మబాదాద్ వరుస బాంబు పేలుళ్ల కేసులో 38 మందికి ఉరిశిక్ష విధిస్తూ గుజరాత్ ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించింది. చట్టవిరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం క్షన్ 302 ప్రకారం మరణశిక్ష విధిస్తూ తీర్పు చెప్పడం సంచలనం కలిగించింది. దీంతో ఒకే కేసులో ఇంత మందికి ఉరిశిక్ష విధించడం ఇదే తొలిసారని చెబుతున్నారు. ఇక ఇదే కేసులో దోషులుగా తేలిన మరో 11 మందికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. వారికి కనీసం పెరోల్ కూడా అవకాశం లేని విధంగా శిక్ష విధించడం గమనార్హం.

పేలుళ్లలో మరణించిన బాధిత కుటుంబాలకు రూ. లక్ష పరిహారం చెల్లించింది. గాయపడిన వారికి రూ. 50 వేల పరిహారం అందజేశారు. దీంతో స్వల్పంగా గాయపడిన వారికి రూ.25 వేలు అందించింది. పేలుళ్లకు ఇండియన్ ముజాహిదీన్ తోపాటు హర్బత్ ఉల్ జిహాదీ ఆల్ ఇస్లామీ ఉగ్రవాద సంస్థలే కారణమని తేలింది. దీంతో 2002 గోద్రా అల్లర్లకు ప్రతీకారంగా ఈ దాడి చేసినట్లు ప్రకటించడంతో అప్పట్లోనే పెద్ద దుమారం రేగింది.
Also Read: అప్పుడే పవన్ కళ్యాణ్ కు సీఎం ఛాన్స్.. కానీ ఈ సింపుల్ లాజిక్ గుర్తిస్తేనే?
దీనిపై అహ్మదాబాద్ లో 20, సూరత్ లో 15 ఎఫ్ఐఆర్ లు నమోదయ్యాయి. 78 మందిని నిందితులుగా నిర్ధారించింది. ఇందులో సరైన సాక్ష్యాధారాలు లేకపోవడంతో మరో 28 మందిని నిర్దోషులుగా ప్రకటించింది. అహ్మదాబాద్ పేలుళ్లు దేశవ్యాప్తంగా భయాందోళనలు కలిగించాయి. జనజీవనం స్తంభించింది ప్రజల్లో ఆందోళన పెరిగింది. దీంతో కోర్టు ప్రత్యేకంగా తీసుకుని విచారణ చేపట్టింది.
కానీ ఒకే కేసులో ఇంత మందికి ఉరి శిక్ష విధించడంతో నేరం చేసిన వాడికి పరోక్షంగా హెచ్చరికలు జారీ చేసినట్లు అయింది. అన్యాయానికి పాల్పడితే ఎవరికైనా శిక్ష తప్పదని తెలుస్తోంది. మనుషుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న వారిని ఉపేక్షించేది లేదని నిరూపించింది.
Also Read: మూడో కూటమిలో జగన్ చేరతారా? కేసీఆర్ తో కలుస్తారా?
[…] […]