
Evaru Meelo Koteeswarulu: జూనియర్ ఎన్టీఆర్(Jr NTR) హోస్ట్ గా రూపొందుతోన్న ‘మీలో ఎవరు కోటీశ్వరులు’ షో ఇప్పుడు జెమినీ టీవీలో ప్రసారమవుతోంది. ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొంటోంది. సామాన్యులను కరోడ్ పతిని చేసే ఈ షో రక్తికడుతోంది. హిందీలో హిట్ అయిన ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ అనే హిందీ షో ఆధారంగా తెలుగులో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ అనే షో నాలుగు సీజన్లు సక్సెస్ ఫుల్ గా రన్ అయ్యింది. ఈసారి ఎన్టీఆర్ హోస్ట్ గా ఆసక్తికరంగా నడుస్తోంది. ఎన్టీఆర్ తనదైన శైలిలో ప్రశ్నలు వేస్తూ కట్టిపడేస్తున్నారు.
తాజాగా ‘మీలో ఎవరు కోటీశ్వరులు’ షోలో అడుగుతున్న ప్రశ్నల మీద పెద్దఎత్తున ట్రోలింగ్ జరుగుతోంది. ఆగస్టు 22న జెమినీ టీవీలో ఎన్టీఆర్ హోస్ట్ గా ఈ షో ప్రసారం అవుతోంది. ఎన్టీఆర్ ఈ షో పేరు మార్చి విజయవంతంగా దీన్ని ముందుకు తీసుకెళ్లుతున్నాడు.
అయితే షో బాగానే ఉన్నా ఇప్పుడు అసలు చిక్కు మాత్రం ఎన్టీఆర్ అడుగుతోన్న ప్రశ్నలతోనే వచ్చి పడింది. ఈ షోలో అడుగుతున్న ప్రశ్నల గురించి నెటిజన్లు పెద్ద ఎత్తున ట్రోలింగ్ కు దిగుతున్నారు. స్కూల్ పిల్లలను అడిగే ప్రశ్నలు తీసుకొచ్చి అడుగుతున్నారని.. చాలా కామెడీగా ఉందని గేలి చేస్తున్నారు. ఇలాంటి సిల్లీ ప్రశ్నలు వింటుంటే నవ్వొస్తోంది అని సోషల్ మీడియాలో కడిగేస్తున్నారు.
అయితే హాట్ సీట్ పై కూర్చుంటే షవరింగ్ వస్తుంది. అందుకే మొదటి ఐదారు ప్రశ్నలను ఈజీగా అడుగుతున్నామని షో నిర్వాహకులు చెబుతున్నారు. కంటెస్టెంట్ అలవాటుపడడానికే ఇలా ఈజీగా అడుగుతున్నామని అంటున్నారు. కంటెస్టెంట్ మానసిక సంఘర్షణకు గురికాకుండా ఇలా చాలా సింపుల్ ప్రశ్నలు అడుగుతున్నామన్నారు. కానీ నెటిజన్లు మాత్రం సిల్లీ ప్రశ్నలంటూ దుమ్మెత్తి పోస్తున్నారు. కనీసం రూ.10వేలు అయినా వారి చేతిలో పెట్టి పంపాలనే ఇలా అడుగుతున్నామని వారు అంటున్నారు.
తాజా ఎపిసోడ్ లో ‘నాలుగు జంతువుల పేర్లు ఇచ్చి’ దానికి ముళ్లు అని పెడితే మరో ప్రాణి పేరు వస్తుందని సిల్లీ ప్రశ్న అడిగాడు. ఇక మరో ప్రశ్నగా.. ‘టీవీలో ఛానల్ మార్చడానికి ఏం ఉపయోగిస్తారు’ అనేది మరో ప్రశ్న. ఇక గోరింటాకు ఎక్కడ పెట్టుకోము అని మరో ప్రశ్న వేశారు. అయితే నెటిజన్లు మాత్రం ఈ ట్రోలింగ్ పై దుమ్మెత్తి పోస్తున్నారు.