Someone Is Using Your Aadhaar: భారతదేశంలో ఒక వ్యక్తికి గుర్తింపు రావాలంటే ఆధార్ కార్డు తప్పనిసరి. పుట్టిన పిల్లలకు బర్త్ డే సర్టిఫికెట్ నుంచి బ్యాంకు అకౌంట్ తెరవాలన్నా.. పాన్ కార్డు తీసుకోవాలన్నా.. ఆధార్ కార్డు తప్పనిసరిగా మారింది. ప్రతి పనిలోనూ ఆధార్ లేకుంటే ముందుకు సాగని పరిస్థితి ఏర్పడింది. అయితే ఆధార్ నెంబర్ ను ఆధారం చేసుకొని కొందరు హ్యాకర్లు బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు మాయం చేస్తున్నారు. మరికొందరు ఇతరుల ఆధార్ నెంబర్ తో సిమ్ కార్డులు తీసుకుంటూ దుర్వినియోగ పనులు చేస్తున్నారు. ఈ తరుణంలో ఆధార్ ను ఎవరైనా ఉపయోగిస్తున్నారా? లేదా? అనేది ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి. ఇందుకోసం ఆధార్ కు సంబంధించిన వెబ్ సైట్ లోకి వెళ్లి ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. అదెలాగంటే?
భారత దేశంలోని ప్రతీ వ్యక్తికి గుర్తింపు రావాలంటే ఆధార్ తప్పనిసరిగా తీసుకోవాలి. ఇదే సమయంలో ఆధార్ ను జాగ్రత్తగా వాడుకోవాలి. అయితే ఒక్కోసారి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఆధార్ దుర్వినియోగం అయ్యే అవకాశం ఉంది. ఈ సమయంలో మన ఆధార్ ఎవరెవరు ఉపయోగించారో తెలుసుకోవచ్చు. ఇందుకోసం ముందుగా UIidai.gov.in అనే వెబ్ సైట్ లోకి వెళ్లాలి. ఆ తరువాత ఆధార్ నెంబర్ ఎంట్రీ చేసిన తరువాత క్యాప్చా ఎంట్రీ చేయాలి. ఇప్పుడు ఆధార్ తో లింక్ ఉన్న మొబైల్ కి ఓటీపీ వస్తుంది.ఈ ఓటీపీని అడిగిన బాక్స్ లో ఎంట్రీ చేయాలి.
ఇప్పుడు అథెంటిక్ హిస్టరీపై క్లిక్ చేయాలి. ఆ తరువాత ‘ఆల్’ని సెలెక్ట్ చేసి ‘ఫెచ్ అథెంటిక్ హిస్టరీపై క్లిక్ చేయాలి’ ఇప్పుడు మీ ఆధార్ ను ఎక్కడెక్కడ ఉపయోగించారో తెలుస్తోంది. మీ ఆధార్ ను మీరు ఉపయోగిస్తే పర్వాలేదు. కానీ ఇతరులు ఉపయోగించడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కొందరు ఆధార్ నెంబర్ ఆధారంగా కొత్త సిమ్ కార్డులను తీసుకుంటారు. ఈ సిమ్ తో గంజాయి, ఇతర దుర్వినియోగ పనులకు వాడుతున్నారు. కొందరు హ్యాకర్లు ఇలా ఆధార్ నెంబర్ తో హ్యాక్ చేస్తున్నారు. దీంతో పోలీసులు ఆ నెంబర్ ను ట్రేస్ చేయగా బాధితులు వేరేవారు అవుతున్నారు.
బ్యాంకు ఆర్థిక వ్యవహారల్లోనూ ఆధార్ తప్పనిసరిగా మారింది. ఈ నేపథ్యంలో కొందరు మనీ హ్యాకర్లు ఆధార్ నెంబర్ ద్వారా ఓటీపీని తెలుసుకొని బ్యాంకు అకౌంట్ నుంచి డబ్బు మాయం చేస్తున్నారు. మరికొందరు ఆధార్ నెంబర్ తో పర్సనల్ డీటేయిల్స్ తెలుసుకొని వారి పేరుమీద రుణాలు తీసుకుంటారు. చాలా మంది బాధితులు తమకు తెలియకుండానే ఎవరో రుణాలు తీసుకున్నట్లు పోలీసులకు ఫిర్యాదులు చేశారు.
అందువల్ల ఆధార్ నెంబర్ ను అపరిచిత వ్యక్తులకు ఇవ్వకుండా చూడండి. ఆధార్ వెరిఫికేషన్ కోసం ఓటీపీ వస్తే స్పందించకపోవడమే మంచిది. ఏదైనా అత్యవసరం అయి అందుబాటులో ఉంటే మాత్రమే ఆధార్ వెరిఫికేషన్ కు స్పందించాలి. ఆధార్ తో లింక్ అయిన బ్యాంకు అకౌంట్ నుంచి ఎలాంటి ఆశ చూపే మెసేజ్ లువచ్చినా స్పందించకపోవడం మంచిది. ఈ సమయంలో నేరుగా బ్యాంకు అధికారులను సంప్రదించాలి