ED notice Tollywood celebrities: టాలీవుడ్ సెలబ్రిటీలు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం పై ఎంతటి తీవ్రమైన వ్యతితేకత ఎదురైందో మనమంతా చూస్తూనే ఉన్నాం. ఎంతటి వారైనా సరే బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తే శిక్ష తప్పదు అని తెలంగాణ ప్రభుత్వం చాలా స్ట్రిక్ట్ గా ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు పోలీస్ కేసులు కూడా సదరు సెలబ్రిటీలపై నమోదు అయ్యాయి. సినీ సెలబ్రిటీలు చాలా మంది దీనిపై స్పందిస్తూ, అప్పట్లో మాకు ఈ బెట్టింగ్ యాప్స్ మీద పెద్దగా అవగాహనా లేక ప్రమోట్ చేశామని, ఆ తర్వాత ఈ యాప్స్ వల్ల ఎంతమంది మోసపోతున్నారో తెలుసుకొని ప్రమోట్ చేయడం రద్దు చేసుకున్నామని, భవిష్యత్తులో కూడా ఇలాంటివి చేయబోమని సెలబ్రిటీలు చెప్పుకొచ్చారు. అయితే ఈ గొడవ జరిగిన తర్వాత ఈమధ్య కాలం లో మళ్ళీ దీనిపై చర్చలు రాలేదు. ఈ మ్యాటర్ అక్కడితో ఆగిపోయిందని అంతా అనుకున్నారు.
Also Read: ‘కల్కి’ లాంటి ప్రాజెక్ట్ ని రిజెక్ట్ చేసిన రామ్ చరణ్..డైరెక్టర్ ఎవరంటే!
కానీ ఈడీ అధికారులు సెలబ్రిటీలందరికీ మరో షాకింగ్ ట్విస్ట్ ఇచ్చారు. బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసిన రానా దగ్గుబాటి(Rana Daggubati), విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) లతో పాటు మరో 29 మంది ప్రముఖ టాలీవుడ్ సెలబ్రిటీలపై కేసులు నమోదు చేశారు. వీరిలో ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్(Prakash Raj), మంచు లక్ష్మి(Manchu Lakshmi), నిధి అగర్వాల్(Nidhi Agarwal) , అనన్య నాగేళ్ల(Ananya Nagella), యాంకర్ శ్రీముఖి(Anchor Srimukhi), యాంకర్ శ్యామలా, హర్ష సాయి, బయ్యా సన్నీ యాదవ్, లోకే బాయ్ నాని,విష్ణు ప్రియా, రీతూ చౌదరి వంటి వారు ఉన్నారు. వీరి పై ఈడీ అధికారులు మనీ లాండరింగ్ చట్టం క్రింద చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి సిద్ధమైంది. మరి విచారణ తో ఈ వ్యవహారాన్ని ఇక్కడితో వదిలేస్తారా?, లేకపోతే అరెస్ట్ చేస్తారా అనేది, లేదా బెట్టింగ్ యాప్స్ ద్వారా నష్టపోయి, అఘాయిత్యం చేసుకున్న అమాయకుల కుటుంబాలకు నష్టపరిహారం కలిగేలా జరిమానా విధిస్తారా అనేది తెలియాల్సి ఉంది.
Also Read: బ్యాటరీ సైకిల్ ని తొక్కుతూ మురిసిపోయిన పవన్ కళ్యాణ్..వైరల్ అవుతున్న ఫోటోలు!
అయితే ఈ IPL సీజన్ లో బెట్టింగ్ యాప్స్ ని సాధ్యమైనంత వరకు న్యూట్రల్ చేయడంలో ప్రభుత్వం విజయం సాధించింది అనే చెప్పాలి. కానీ కొంతమంది దుండగులు టెలిగ్రామ్ ద్వారా కొన్ని అనధికారిక బెట్టింగ్ యాప్స్ లింక్స్ ని ప్రమోట్ చేశారు. ఇక నుండి అవి లేకుండా పూర్తిగా బెట్టింగ్ యాప్స్ నిర్మూలన పై రాష్ట్ర ప్రభుత్వాల నుండి కేంద్ర ప్రభుత్వాల వరకు కఠినమైన చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియా ద్వారా నెటిజెన్స్ కోరుకుంటున్నారు. బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చెయ్యాలంటే సెలబ్రిటీలకు వణుకు పుట్టాలని బలంగా కోరుకుంటున్నారు. మరి ఇది ఎంత వరకు ఆచరణలోకి వస్తుందో చూడాలి.