
సుప్రీం కోర్టు ఈ- కమిటీ ఆదివారం ఈ-కోర్టు సర్వీసెస్ మొబైల్ యాప్ మాన్యువల్ ను విడుదల చేసింది. ఈ యాప్ 14 భాషల్లో ప్రజలకు అందుబాటులో ఉంటుందని తెలిపింది. తెలుగు, ఇంగ్లిష్, అస్సామీస్, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, ఖాసీ, మలయాళం, మరాఠీ, నేపాలి, ఒడియా, పంజాబీ, తమిళం భాషల్లో ఈ యాప్ అందుబాటులో ఉంటుంది. ఇప్పటి వరకు ఈ యాప్ డౌన్ లోడ్స్ 57 లక్షలకుపైగా నమోదైనట్లు తెలిపింది. ఈ కోర్ట్స్ సర్వీసెస్ మొబైల్ యాప్ వల్ల కక్షిదారులు, ప్రజలు, న్యాయవాదులు, పోలీసులు, ఇతర సంస్థాగత లిలిగెంట్లు ప్రయోజనం పొందవచ్చు.