https://oktelugu.com/

Venkatesh: వెంకటేష్, రవితేజ కాంబో లో రావాల్సిన ఆ సూపర్ హిట్ సినిమా ఎందుకు మిస్ అయిందో తెలుసా..?

అటు మాస్, ఇటు క్లాస్ ఎలాంటి పాత్రనైనా రవితేజ పోషించగలిగే కెపాసిటీ ఉన్న నటుడు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇక ఇలాంటి క్రమంలోనే వెంకటేష్, రవితేజ ఇద్దరి కాంబోలో ఒక మల్టీ స్టారర్ సినిమా రావాల్సింది. కానీ అనుకోని కారణాలవల్ల అది ఆగిపోయింది అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఇంతకీ ఆ సినిమా ఏంటి అంటే విజయ్ సేతుపతి మాధవన్ కలిసి తమిళంలో చేసిన 'విక్రమ్ వేద' సినిమాను తెలుగులో వీళ్ళిద్దరిని పెట్టి రీమేక్ చేయాలని అనుకున్నారు.

Written By:
  • Gopi
  • , Updated On : July 16, 2024 / 01:36 PM IST

    Venkatesh

    Follow us on

    Venkatesh: ఫ్యామిలీ ఆడియన్స్ ను థియేటర్ కి రప్పించడం లో వెంకటేష్ చాలా కీలకపాత్ర వహిస్తాడు… ఈయన చేసిన సినిమాలు క్లీన్ యు సర్టిఫికెట్ సినిమాలుగా ఉంటాయి. అందుకోసమే ప్రేక్షకులు అందరూ ఈయన సినిమాలు చూడడానికి ఎక్కువగా ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఏదైన పండుగ సీజన్ లో ఈయన సినిమాలు వస్తే మాత్రం వాటిని ఫ్యామిలీ మొత్తం మిస్ అవ్వకుండా థియేటర్లోనే చూసి ఆ సినిమా సక్సెస్ లో వాళ్లు కూడా కీలకపాత్ర వహిస్తారు…ఇక ఇదిలా ఉంటే రవితేజ లాంటి స్టార్ హీరో కూడా ఇండస్ట్రీలో సొంతగా ఎదిగి తనకంటూ ఒక మార్గాన్ని క్రియేట్ చేసుకున్నాడు.

    అటు మాస్, ఇటు క్లాస్ ఎలాంటి పాత్రనైనా రవితేజ పోషించగలిగే కెపాసిటీ ఉన్న నటుడు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇక ఇలాంటి క్రమంలోనే వెంకటేష్, రవితేజ ఇద్దరి కాంబోలో ఒక మల్టీ స్టారర్ సినిమా రావాల్సింది. కానీ అనుకోని కారణాలవల్ల అది ఆగిపోయింది అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఇంతకీ ఆ సినిమా ఏంటి అంటే విజయ్ సేతుపతి మాధవన్ కలిసి తమిళంలో చేసిన ‘విక్రమ్ వేద’ సినిమాను తెలుగులో వీళ్ళిద్దరిని పెట్టి రీమేక్ చేయాలని అనుకున్నారు. కానీ అనుకోని కారణాలవల్ల ఈ సబ్జెక్ట్ అనేది ఆగిపోయింది.

    మరి ఎందుకు ఈ సబ్జెక్టు ఆగిపోయింది అనే విషయం మీద కొన్ని వార్తలైతే వచ్చాయి. మొత్తానికైతే వీళ్లిద్దరూ ఒక సినిమా చేస్తున్నారని అప్పట్లో ఒక న్యూస్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. వీరిద్దరి కలిసి సినిమా చేస్తే చూడడానికి ప్రేక్షకులు కూడా సిద్ధమయ్యారు. కానీ చివరి క్షణంలో మాత్రం ఈ రీమేక్ తెలుగులో అంత బాగా వర్కౌట్ అవదనే ఉద్దేశ్యంతోనే దాన్ని పక్కన పెట్టారనే వార్తలైతే వచ్చాయి. ఇక మొత్తానికైతే అటు వెంకటేష్, ఇటు రవితేజ అభిమానులు తీవ్రమైన నిరాశకు గురయ్యారనే చెప్పాలి…

    ఇక ఇప్పటికే వెంకటేష్ పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లాంటి హీరోలతో కూడా కలిసి నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక వెంకటేష్ మల్టీ స్టారర్ సినిమాలు చేయడంలో చాలా ఉత్సాహాన్ని చూపిస్తూ ఉంటాడు. అందువల్లే ఆయనతో సినిమాలు చేయడానికి ప్రతి దర్శకుడు కూడా ఆసక్తి చూపిస్తూ ముందుకు సాగుతూ ఉంటారు. ఇక వెంకటేష్ గత చిత్రమైన సైంధవ్ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేకపోయింది. ఇప్పటికే వెంకటేష్ అనిల్ రావిపూడి డైరెక్షన్ లో అలాగే వేణు ఉడుగుల డైరెక్షన్ లో కూడా మరొక సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఇక రవితేజ కూడా హరీష్ శంకర్ డైరెక్షన్ లో ‘మిస్టర్ బచ్చన్’ అనే సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయింది. వచ్చే నెలలో రిలీజ్ కి రెడీ అవుతుంది. ఇక దీంతో పాటుగా మరో రెండు సినిమాలకు కూడా కమిట్ అయ్యాడు…

    అయితే వెంకటేశ్, రవితేజ కాంబినేషన్ లో ‘విక్రమ్ వేద’ సినిమా మిస్ అయిన తర్వాత మరొక సినిమా వస్తుందని అందరూ అనుకున్నారు. ఇక హరీష్ శంకర్ కూడా వీళ్లతో ఒక సినిమా చేసాడు. కానీ అది మెటీరియలైజ్ అవ్వలేదు. నిజానికి హరీష్ శంకర్ డైరెక్షన్ లోనే వీళ్ళిద్దరూ సినిమా చేయాల్సింది. కానీ అది కూడా వర్కౌట్ అవ్వలేదు. మొత్తానికైతే రవితేజ, వెంకటేష్ కాంబో లో సినిమా ఎప్పుడు వస్తుందో తెలియదు. కానీ వీళ్ల కాంబినేషన్ లో మాత్రం పక్కగా ఒక సినిమా వస్తుందని ఇద్దరు ఒకానొక సమయంలో తెలియజేశారు…