
సాధారణంగా మనం ఎల్లప్పుడు దానం, ధర్మం అనే పదాలను వాడుతూ ఉంటాము.ఎవరైనా పేదవారికి తమ వంతు సాయంగా తమ శక్తిసామర్థ్యాలకు తగ్గట్టుగా వస్తు రూపంలో నైనా లేదా ధన రూపంలో నైనా లేదా ధాన్యరూపంలోనైనా దానధర్మాలు చేయడం మనం చూస్తూనే ఉంటాం. అదేవిధంగా కొందరు బ్రాహ్మణులకు దానం చేయటం వల్ల పరలోక సుఖాలు కలుగుతాయని భావిస్తారు. అయితే దర్మం చేయడానికి ఎలాంటి పరిమితులు లేవు. కానీ దానం చేయాలంటే కొన్ని నియమాలు పాటించాలి. ఏ వస్తువును పడితే ఆ వస్తువులను దానం చేయకూడదు. ఆ విధంగా దానం చేయటం వల్ల కష్టాలను కొని తెచ్చుకున్న వారవుతారు.అయితే ఏ వస్తువులను దానం చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం…
ఎవరైనా మన ఇంటికి ఆకలితో అన్నం కోసం వచ్చినప్పుడు వారికి చెడిపోయినవి లేదా తినడానికి పనికి రానివి దానం చేయకూడదు. అలాంటి ఆహార పదార్థాలను దానం చేయడం వల్ల న్యాయపరమైన సమస్యలు తలెత్తుతాయి. కోర్టుల చుట్టూ తిరగాల్సి ఉంటుంది. చినిగిపోయిన దుస్తులను లేదా చెడిపోయిన వస్తువులను ఇతరులకు దానం చేయడం వల్ల మన వెంట దురదృష్టం వెంటాడి అన్ని అపజయాలే కలుగుతాయి. చీపురును దానం చేసే వారి ఇంటిలో లక్ష్మీదేవి కొలువై ఉండదు . చీపురు దానం చేయడం అంటే సాక్షాత్తు లక్ష్మీదేవిని దానం చేసినట్లే.
ఎవరికైనా సూది, కత్తెర, కత్తులు వంటి వాటిని దానం చేయటం వల్ల ఏరి కోరి దాంపత్య జీవితంలో కష్టాలు కొనితెచ్చుకున్నట్లే. ప్లాస్టిక్ వస్తువులను దానం చేయటం వల్ల జీవితంలో అనేక సమస్యలు ఏర్పడతాయి. అందుకోసమే ఎవరికైనా దానం చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్త పడి దానాలు చేయాలి. ఈ విధమైన వస్తువులను దానం చేయడం వల్ల కష్టాలను కొనితెచ్చుకున్నట్లు అవుతుందని పండితులు చెబుతున్నారు.