Bala Gopaludu: చాలా మంది స్టార్ ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్టులుగా కొనసాగి ఇప్పుడు స్టార్లుగా ఎదిగారు. ఆ లిస్ట్ లో మహేష్ బాబు, రాశి, మీనా, హన్సిక, ఎన్.టి.ఆర్, తమన్నా వంటి ఎందరో స్టార్లు ఉన్నారు. నటన మీద ఉన్న ఆసక్తితో ఇండస్ట్రీని వదలకుండా అందులోనే కంటిన్యూ అవుతూ తమ టాలెంట్ ను ప్రూఫ్ చేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు బాలయ్య సినిమాలో నటించిన కొందరు చైల్డ్ ఆర్టిస్టుల గురించి వారు ఇప్పుడు ఏం చేస్తున్నారు అనే వివరాలు తెలుసుకుందాం.
హరికృష్ణ పెద్ద కొడుకు కళ్యాణ్ రామ్ ఒక చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి అందరినీ అలరించిన విషయం మీకు తెలుసా. అవును కళ్యాణ్ రామ్ కూడా చైల్డ్ ఆర్టిస్టుగా నటించారు. ఇంతకీ కళ్యాణ్ రామ్ నటించిన ఆ చిత్రం ఏంటి అనుకుంటున్నారా? 1989 లో కోడి రామ కృష్ణ దర్శకత్వంలో బాలకృష్ణ,సుహాసిని జంటగా ‘ బాలగోపాలుడు ‘ అనే చిత్రంలో నటించారు. ఈ చిత్రం ద్వారా కళ్యాణ రామ్ తొలిసారిగా తెలుగు తెరకు పరిచయం అయ్యారు.
ఇందులో బాలయ్య తో పాటు ఇద్దరు పిల్లలు కూడా నటించారు. అందులో ఒకరు రాశి మరొకరు కళ్యాణ్ రామ్ వీరిద్దరూ చైల్డ్ ఆర్టిస్ట్ లుగా నటించారు. వీరి నటన ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. సినిమా కమర్షియల్ గా ఓకే అనిపించుకున్న చైల్డ్ ఆర్టిస్ట్ లుగా కళ్యాణ్ రామ్, రాశి చేసిన నటన ప్రేక్షకులకు మంచి మెమోరిలాగా నిలిచిపోయింది.
ఆతర్వాత సరిగ్గా పదేళ్ళకు చైల్డ్ ఆర్టిస్ట్ గా మనల్ని అలరించిన రాశి.. ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో వచ్చిన కృష్ణబాబు చిత్రంలో బాలయ్య సరసున హీరోయిన్ గా నటించి మెరిసింది. పదేళ్ళ ముందు బాలయ్యకు కూతురిగా నటించిన రాశి ఆ తర్వాత ఆయన పక్కన హీరోయిన్ గా చేసే స్థాయికి ఎదిగడం నిజంగా గ్రేటే.. కానీ ఈ సినిమా అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. అంతేకాదు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది ఈ సినిమా.