Mahesh Babu Heroine: సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎదగడం అనేది చాలా కష్టమైన పని. ఎందుకంటే ఇక్కడ హీరోలకి ఉన్నంత ఫ్రీడం హీరోయిన్స్ కి ఉండదు. హీరో కి ఒక నాలుగు ప్లాప్ లు వచ్చిన కూడా మళ్లీ అతనికి తో సినిమా చేయడానికి దర్శక నిర్మాతలు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. కానీ హీరోయిన్ల విషయంలో మాత్రం అలా ఉండదు. ఆమె ఎప్పుడూ కంటిన్యూస్ గా సక్సెస్ లో ఉంటూ ఉండాలి. అలా లేకపోతే ఆమెను పక్కన పెట్టి సక్సెస్ లో ఉన్న హీరోయిన్స్ ను మాత్రమే తమ సినిమాల్లోకి తీసుకుంటారు.
కాబట్టి ఇక్కడ ఒక్క ఫ్లాప్ వచ్చినా కూడా హీరోయిన్ల కెరీర్ అనేది డైలమాలో పడిపోతుందని చెప్పాలి. ఇక మొత్తానికైతే కొంతమంది వరుస సక్సెస్ లను అందుకుంటు స్టార్ హీరోయిన్ రేంజ్ లో కూడా కొనసాగుతూ ఉంటారు. ఇక ఇది ఇలా ఉంటే ఒకప్పుడు మహేష్ బాబు సినిమాలో హీరోయిన్ గా నటించి ప్రస్తుతం అవకాశాలు లేక ఇండస్ట్రీ నుంచి ఫేడ్ ఔట్ అయిపోయిన ఒక హీరోయిన్ గురించి మనం తెలుసుకుందాం…మహేష్ బాబు హీరోగా వచ్చిన వంశీ సినిమాలో ‘మయూరి కాంగో’ సెకండ్ హీరోయిన్ గా నటించింది. అయితే ఈ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేదు. దాంతో తెలుగులో ఆమెకి పెద్దగా అవకాశాలైతే రాలేదు. అయితే ఈ ముద్దుగుమ్మ 13 సంవత్సరాలకే బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. ఇక అక్కడ ఒకటి రెండు సినిమాలు చేసినప్పటికీ అవి పెద్దగా వర్కౌట్ అవ్వలేదు.
దాంతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. అయితే ఇక్కడ కూడా తనకు ఆశించిన మేరకు సక్సెస్ అయితే రాలేదు. దాంతో ఆమె చాలా తొందరగానే అంటే 19 ఏళ్లకే ఇండస్ట్రీ నుంచి ఫేడ్ ఔట్ అయిపోవాల్సి వచ్చింది. 13 ఏళ్లకు ఎంట్రీ ఇచ్చి 19 ఏళ్లకు ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోవడం అనేది చాలా దారుణమైన విషయమనే చెప్పాలి. ఇక ఆ తర్వాత ఆమె తన కుటుంబాన్ని పోషించుకోవడానికి మయూరి కాంగో నర్గీస్, తొడ ఘం తొడ ఖుషి, డాలర్ బాబు, కిట్టి పార్టీ లాంటి టీవీ షోలను కూడా చేసింది.
ఆయినప్పటికి అక్కడ కూడా పెద్దగా సక్సెస్ అయితే సాధించలేకపోయింది. దాంతో పెర్ఫార్మిక్స్ అనే కంపెనీలో మేనేజింగ్ డైరెక్టర్ గా కూడా పని చేసింది. ఇక తర్వాత 2019 సంవత్సరంలో గూగుల్ ఇండియాలో ఇండస్ట్రీ హెడ్ గా చేరింది. ఇక మొత్తానికైతే సినిమా ఇండస్ట్రీ నుంచి ఫేడ్ అవుట్ అయిపోయిన తర్వాత ఈ ముద్దుగుమ్మ జాబ్ చేసుకుంటూ తన లైఫ్ ను లీడ్ చేస్తుందనే చెప్పాలి…
View this post on Instagram