Dil Raju Wife Dance: తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ ప్రొడ్యూసర్లలో దిల్ రాజు ఒకరు…ఈయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశం అయితే ఉంటుంది. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు చాలా వరకు సక్సెస్ లను సాధించాయి. దానికి కారణం దిల్ రాజు జడ్జిమెంట్ అనే చెప్పాలి. ఆయన ఏ కథనైనా సరే క్లారిటీగా జడ్జ్ చేసేస్తాడు. ఏ సినిమా ఆడుతుంది, ఏ సినిమా ప్లాప్ అవుతోంది అనేది ఆయనకు తెలిసినంతగా ఇంకెవ్వరికి తెలియదని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. అయితే దిల్ రాజు భార్య అనిత గత కొన్ని సంవత్సరాల క్రితం మరణించడంతో ఆయన వైగారెడ్డి అనే ఆవిడని సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడు. వీళ్ళ అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా ఒక మగ పిల్లాడు కూడా ఉన్నాడు. అయితే వైగా రెడ్డి ఈ మధ్య ఎక్కువగా మీడియా ముందుకు వస్తున్నారు. ఆమె వంటలు చేస్తూ కొన్ని వీడియోలను రిలీజ్ చేస్తున్నారు. అలాగే రీసెంట్ గా ఆమె డాన్స్ వేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఆమె అద్భుతంగా డాన్స్ చేస్తుంది అంటూ సోషల్ మీడియా మొత్తం అదే న్యూస్ వైరల్ అయింది. మరి ఏది ఏమైనా కూడా వైగా రెడ్డి సినిమా ఇండస్ట్రీలో తన భర్తకు తోడుగా సినిమా ప్రొడక్షన్ కి సంబంధించిన పనులను కూడా చూసుకోవాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది…
Also Read: సినిమా సక్సెసా? హడావుడిగా సక్సెస్ మీట్ ఎందుకు ‘వీరమల్లు’?
దిల్ రాజు కూతురు హన్షీత దిల్ రాజు వాళ్ళ అన్న కొడుకు అయిన హర్షిత్ రెడ్డి ఒక బ్యానర్ ను చేసి అందులో చిన్న సినిమాలను నిర్మిస్తున్న విషయం మనకు తెలిసిందే. మరి ఇలాంటి సందర్భంలోనే వాళ్ళు చేయబోతున్న సినిమాల విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకుంటూ మరి ముందుకు సాగుతున్నారు.
మొత్తానికైతే దిల్ రాజు సర్ వెంకటేశ్వర క్రియేషన్స్ మీద పెద్ద సినిమాలను ప్రొడ్యూస్ చూస్తూనే, సినిమాలను హ్యాండిల్ చేసే బాధ్యతను హన్సిత, హర్షిత్ లకి ఇచ్చినట్టుగా తెలుస్తోంది… మరి ఏది ఏమైనా కూడా ఇకమీదట వీళ్ళు బ్యానర్ లో వచ్చే సినిమాలు మంచి విజయాలను సాధించాలని అతని అభిమానులు కూడా కోరుకుంటున్నారు.
Also Read: కన్నప్పలో ఎన్టీఆర్ ఎలా మిస్సయ్యాడు?
రీసెంట్ గా నితిన్ హీరోగా వచ్చిన ‘తమ్ముడు’ సినిమా విజయాన్ని సాధించకపోవడంతో దిల్ రాజు కొంతవరకు డల్ అయ్యాడు. రాబోయే సినిమాలతో మంచి విజయాలను సాధించి ఆయనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నట్టుగా తెలుస్తోంది…