Vettaiyan Movie: ‘లాల్ సలాం’ వంటి ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ తర్వాత సూపర్ స్టార్ రజినీకాంత్ హీరో గా నటించిన ‘వెట్టియాన్’ చిత్రం నేడు తెలుగు, తమిళం భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైన సంగతి తెలిసిందే. నేడు మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా, ఈమధ్య కాలం లో కొత్త తరహా రజినీకాంత్ సినిమాగా అనిపించిందంటూ సోషల్ మీడియా లో ఈ సినిమాని చూసిన నెటిజెన్స్, రివ్యూయర్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఓపెనింగ్స్ కూడా తమిళనాడు తో పాటుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో అద్భుతంగా వచ్చాయి. ముందుగా ఈ చిత్రానికి తెలుగు లో ఎలాంటి బజ్ లేదని ట్రేడ్ పండితులు అంటుండేవారు. కానీ నిన్న రాత్రి నుండి అడ్వాన్స్ బుకింగ్స్ ఊపందుకున్నాయి. జైలర్ రేంజ్ ఓపెనింగ్ కాకపోయినా, మొదటి రోజు కేవలం తెలుగు వెర్షన్ నుండే 3 కోట్ల రూపాయిల షేర్ వసూళ్ళను సాధించిందట.
ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ 9 కోట్ల రూపాయలకు జరగగా వీకెండ్ తో బ్రేక్ ఈవెన్ మార్గుని అందుకుంటుందని అంటున్నారు. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకి సూపర్ హిట్ టాక్ రావడానికి ప్రధాన కారణాలలో ఒకరు రజినీకాంత్ అయితే, మరొకరు ఫహాద్ ఫాజిల్. సినిమా చూసొచ్చిన ప్రతీ ఒక్కరు రజినీకాంత్ తర్వాత ఎక్కువగా ఫహాద్ ఫాజిల్ క్యారక్టర్ గురించే మాట్లాడుకున్నారు. అంత అద్బుతమగా ఈ సినిమాలో నటించాడు ఆయన. అయితే ఈ క్యారక్టర్ ని తొలుత ఫహాద్ తో కాకుండా నేచురల్ స్టార్ నాని తో చేయించాలని అనుకున్నాడట డైరెక్టర్ జ్ఞాన్ వేల్ రాజా. నాని కి కూడా ఆ పాత్ర చాలా బాగా నచ్చింది, చేస్తానని చెప్పాడు, కానీ సెట్స్ మీదకు వెళ్తున్న సమయం లో ఆయన ఈ సినిమా నుండి తప్పుకున్నాడు. ఒకవేళ చేసి ఉండుంటే నాని పేరు కోలీవుడ్ మొత్తం మారుమోగిపోయి ఉండేది. రజినీకాంత్ తో సినిమాలో చిన్న అవకాశం వచ్చినా చాలు అని అనుకుంటూ ఉంటారు.
అలాంటి సూపర్ స్టార్ సినిమాలో ఇంత బలమైన క్యారెక్టర్ ని నాని వదిలేసాడంటే, దాని వెనుక ఉన్న కారణం ఏమి అయ్యుంటుంది అని అభిమానులు ఆరా తీస్తున్నారు. రీసెంట్ గానే నాని ‘సరిపోదా శనివారం’ చిత్రం తో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ సక్సెస్ ని అందుకున్నాడు. ఈ చిత్రానికి ముందు ‘దసరా’, ‘హాయ్ నాన్న’ చిత్రాలు కూడా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యాయో మన అందరికి తెలిసిందే. హీరో గా పీక్ రేంజ్ ని ఎంజాయ్ చేస్తున్న సమయంలో క్యారక్టర్ రోల్స్ ఎందుకు అని ఆయన ఈ చిత్రాన్ని వదిలేసి ఉండొచ్చు. కానీ స్క్రీన్ మీద ఫహాద్ ఫాజిల్ కనిపించినంత సేపు నేచురల్ స్టార్ నాని ని చూస్తున్నట్టుగానే అందరికీ అనిపించింది. ప్రస్తుతం నాని ‘దసరా’ దర్శకుడు శ్రీకాంత్ ఓడేలా తో ఒక సినిమా చేయనున్నాడు. ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు.
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
Read MoreWeb Title: Did you know top tollywood actor missed fahad fazil role in vettaiyan
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com