Homeఎంటర్టైన్మెంట్Anchor Lasya : అవకాశాలు లేక కూలీగా మారిన యాంకర్ లాస్య, ఇటుకలు మోస్తూ దీనస్థితిలో...

Anchor Lasya : అవకాశాలు లేక కూలీగా మారిన యాంకర్ లాస్య, ఇటుకలు మోస్తూ దీనస్థితిలో బిగ్ బాస్ బ్యూటీ!

Anchor Lasya : లాస్య మంజునాథ్ అలియాస్ యాంకర్ లాస్య… బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. పలు టెలివిజన్ షోలలో ఆమె సందడి చేశారు. లాస్య ఒకటి రెండు చిత్రాల్లో కూడా నటించడం విశేషం. బిగ్ బాస్ తెలుగు సీజన్ 4లో లాస్య కంటెస్టెంట్ చేసింది. కొన్నాళ్ళు బుల్లితెరకు దూరమైన ఆమె సడన్ గా బిగ్ బాస్ రియాలిటీ షోలో మెరిసింది. లాస్యకు ప్రేక్షకుల్లో పాజిటివిటీ ఉంది. లాస్య ఇతర కంటెస్టెంట్స్ హర్ట్ కాకుండా గేమ్ ఆడేది. చాలా వరకు కూల్ యాటిట్యూడ్ మైంటైన్ చేసేది.

అయితే హోస్ట్ నాగార్జున నీది ఫేక్ స్మైల్ అనడంతో ఆమె ఫీల్ అయ్యింది. లాస్య బిగ్ బాస్ హౌస్లో ప్రధాన చెఫ్ గా మారింది. ఇంటి సభ్యులందరికీ రుచికరమైన భోజనం వండి పెట్టేది. ఒకసారి ఆమె వంట వలన అపశ్రుతి చోటు చేసుకుంది. లాస్య చేసిన పప్పు తిన్న కంటెస్టెంట్స్ అందరికీ మోషన్స్ అయ్యాయి. దాంతో హౌస్ మేట్స్ తో పాటు నాగార్జున ఆమెను ఎగతాళి చేశారు.

లాస్య కేవలం ఒక బ్యాచ్ తో ఉండేది. అభిజీత్, హారిక, నోయల్ లతో మాత్రమే సమయం గడిపేది. ఇది లాస్యను మైనస్ అని చెప్పాలి. అలాగే ఆమె సేఫ్ గేమ్ ఆడటం కూడా ప్రేక్షకులకు నచ్చలేదు. టైటిల్ ఫేవరేట్ గా బరిలో దిగిన లాస్య 11 వ వారం ఎలిమినేట్ అయ్యింది. బయటకు వచ్చాక లాస్య యూట్యూబ్ ఛానల్ కి ఆదరణ పెరిగింది. ఆమె తరచుగా వీడియోలు చేస్తుంటారు. లాస్యను ఇద్దరు కుమారులు.

మంజునాథ్ అనే వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకున్నట్లు బిగ్ బాస్ హౌస్లో లాస్య చెప్పుకొచ్చింది. కొన్నాళ్ళు తన తండ్రి దూరం పెట్టాడని, కొడుకు పుట్టాక తన ప్రేమను అర్థం చేసుకున్నాడని చెప్పుకొచ్చింది. ఇంస్టాగ్రామ్ లో చాలా యాక్టీవ్ గా ఉంటుంది లాస్య. కాగా ఆమె భవన నిర్మాణ కార్మికురాలిగా మారిన ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. చంకలో చంటి బిడ్డతో ఇటుకలు మోస్తున్న లాస్య దీన స్థితి చూసి అందరూ వాపోతున్నారు.

అవకాశాలు లేక చివరికి లాస్య ఇలా తయారైందా? అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే నిజానికి లాస్య అంత దారిద్ర్యంలో లేదు. ఉమన్ పవర్ తెలియజేసే క్రమంలో దసరాను పురస్కరించుకుని లాస్య ఒక ఫోటో షూట్ చేసింది. దానికి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అదన్నమాట సంగతి…

 

View this post on Instagram

 

A post shared by Lasya Manjunath (@lasyamanjunath)

RELATED ARTICLES

Most Popular