Rajamouli Brother: స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా తన కెరీర్ ని స్టార్ట్ చేసిన డైరెక్టర్ రాజమౌళి…మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని సాధించాడు. ఇక ఆ తర్వాత ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరోలందరిని స్టార్ హీరోలుగా మార్చడంలో తను కీలకపాత్ర వహిస్తూ వచ్చాడు…ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన తెలుగులో భారీ పాపులారిటీని సంపాదించుకున్న తర్వాత ప్రభాస్ తో బాహుబలి అనే సినిమా చేసి పాన్ ఇండియాలో తన సత్తా ఏంటో చూపించాడు. ముఖ్యంగా ఈ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీని పాన్ ఇండియా లెవల్ కి తీసుకెళ్లిన ఘనత కూడా తనకే దక్కుతోంది…ఇక ఇదిలా ఉంటే రాజులు వాళ్ల అన్నయ్య కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ అనే విషయం మనలో చాలామందికి తెలియదు… ఐతే, అనుకోకుండా ఒక రోజు, సాహసం లాంటి సినిమాలతో మంచి గుర్తింపును సంపాదించుకున్న చంద్రశేఖర్ ఏలేటి రాజమౌళికి వరుసకి అన్నయ్య అవుతాడు. వీళ్ళ ఫ్యామిలీ కి వల్ల ఫ్యామిలీ కి మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి… రాజమౌళి ఇండస్ట్రీకి రావడానికి తను చాలా హెల్ప్ చేశారు అంటూ గతంలో రాజమౌళి తెలియజేశాడు.
మరి ఏది ఏమైనా కూడా రాజమౌళి లాంటి దర్శకుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉండడం అనేది నిజంగా ఇండస్ట్రీ చేసుకున్న అదృష్టమనే చెప్పాలి. ఇక ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేసిన కూడా రాజమౌళి సినిమాలకి ఉన్న గుర్తింపు వేరే దర్శకుల సినిమాలకు రావడం లేదని చెప్పడంలో ఎంతో మాత్రం అతిశయోక్తి లేదు…
ఆయన ఒక సినిమా కోసం మూడు సంవత్సరాల సమయాన్ని కేటాయించిన కూడా ఆ సినిమాలో భారీ యాక్షన్ ఎలిమెంట్స్ పెట్టీ ప్రేక్షకుడిని అలరిస్తాడు. ప్రతి ప్రేక్షకుడిని సాటిస్ఫై చేసే విధంగా ఆయన సినిమాల్లో యాక్షన్ ఉంటుంది. ఇక ఎమోషన్ విషయంలో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రాజమౌళి ఎమోషన్ ని పట్టి పిండేస్తూ ఉంటాడు.
ఆది ప్రతి ప్రేక్షకుడికి కనెక్ట్ అవుతూ ఉంటుంది. అందువల్లే అతనికి భారీ సక్సెసులైతే దక్కుతున్నాయి. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలన్నీ కూడా సూపర్ సక్సెస్ అవ్వడానికి ముఖ్య కారణం అతను ఎమోషన్ ని బాగా హ్యాండిల్ చేయడమే అంటూ పలువురు సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తూ ఉండడం విశేషం…ఇక ఇప్పుడు మహేష్ బాబు తో చేస్తున్న సినిమాను సైతం సూపర్ సక్సెస్ గా నిలుపడానికి తీవ్రమైన ప్రయత్నం అయితే చేస్తున్నాడు…