https://oktelugu.com/

Rajamouli: రాజమౌళి మీద ఉన్న బ్యాడ్ రికార్డ్ ను ఎన్టీయార్ తొలిగించాడా..? లేదా..?

రాజమౌళి లాంటి టాలెంటెడ్ డైరెక్టర్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉండడం నిజంగా మన అదృష్టం...ఇండియా లో ఉన్న ప్రతి ఒక్క దర్శకుడు ఆయన్ని చూసి ఇన్స్పిరేషన్ పొందుతున్నారు అంటే తెలుగు సినిమా ఖ్యాతిని పెంచడంతో పాటు ఆయన రేంజ్ ను కూడా భారీగా పెంచుకున్నాడు...

Written By:
  • Gopi
  • , Updated On : October 5, 2024 / 12:52 PM IST

    Rajamouli interesting comments on Jr NTR

    Follow us on

    Rajamouli: దర్శక ధీరుడు రాజమౌళి చేసిన సినిమాలన్ని కూడా ఇండస్ట్రీలో సూపర్ సక్సెస్ గా నిలుస్తాయి. అందుకే ఆయనను సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పిలుస్తూ ఉంటారు. ఇక మొత్తానికైతే ఆయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశం ఉండడమే కాకుండా ప్రతి హీరోని చాలా కొత్తగా చూపిస్తూ అతనిలో అతనికి తెలియని టాలెంట్ ని బయటకు తీస్తూ ఉంటాడు. అందుకే రాజమౌళి సినిమాలో ఒక్కసారి నటించాలని ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క స్టార్ హీరో కోరుకుంటూ ఉంటారు. వాళ్ల కెరియర్ లోనే అప్పటి వరకు లేని భారీ రికార్డులను కూడా రాజమౌళితో సినిమా చేస్తే చాలు ఆయా హీరోలకు భారీ రికార్డులు దక్కుతాయి… వాళ్ళు ఎవర్ నైట్ లో స్టార్ హీరోలుగా మారుతారు. అందుకే రాజమౌళి కోసం ప్రముఖ హీరోలు సైతం వేచి చూస్తూ ఉంటారు. ఇక ఇదిలా ఉంటే రాజమౌళితో సినిమా చేయడానికి చాలా మంది ప్రొడ్యూసర్లు ముందుకు వస్తూ ఉంటారు.

    ఆయన అడిగినంత డబ్బులు ఇవ్వడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. ఇక బ్లాంక్ ఇవ్వడానికి కూడా కొంత మంది ప్రొడ్యూసర్లు రెఢీ అవుతుండటం విశేషం…ఇక ఏది ఏమైనప్పటికి రాజమౌళి ప్రస్తుతం తన సక్సెస్ ల పరంపరం కొనసాగిస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇక మీదట కూడా ఇండస్ట్రీ లో సూపర్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా కొనసాగినట్టైతే ఇక ఆయనను మించిన దర్శకుడు మరొకరు ఉండరు అనేది వాస్తవం…

    ఇక ఇదిలా ఉంటే ఈయనతో సినిమా చేసిన తర్వాత ఆయా హీరోలకు వాళ్ళ కెరియర్లో చేసే తర్వాత సినిమాలు ఫ్లాప్ గా నిలుస్తాయి అనే ఒక నమ్మకం అయితే ఉంది. ఇక ఇప్పటి వరకు ఆ నమ్మకాన్ని ఏ ఒక్కరూ చెరిపేయలేదు. ఇక జూనియర్ ఎన్టీఆర్ రాజమౌళి తో చేసిన ‘త్రిబుల్ ఆర్’ సినిమా తర్వాత కొరటాల శివ డైరెక్షన్ లో చేసిన దేవర సినిమా రీసెంట్ గా రిలీజ్ అయింది. ఈ సినిమా ముందుగా డివైడ్ టాక్ తెచ్చుకున్నప్పటికి ఇప్పుడు మాత్రం సక్సెస్ టాక్ ని తెచ్చుకొని ముందుకు సాగుతుంది.

    ఇక మొత్తానికైతే జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాతో సక్సెస్ ని సాధించాడని ట్రేడ్ పండితులు సైతం ఒప్పుకుంటున్నారు. కాబట్టి రాజమౌళి మీద ఉన్న ముద్రను జూనియర్ ఎన్టీఆర్ తొలగించాడనే చెప్పాలి. ఇక మొత్తానికైతే రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్ జూనియర్ ఎన్టీఆర్ తో నాలుగు సినిమాలను చేయడం అనేది మామూలు విషయం కాదు.ఇక వీళ్ళ బాండింగ్ కి గుర్తుగా జూనియర్ ఎన్టీఆర్ మళ్లీ రాజమౌళి పేరు మీద ఉన్న బ్యాడ్ రికార్డును కూడా తొలగించడం విశేషం…