https://oktelugu.com/

Devara: భారీ రేటు కి అమ్ముడుపోయిన దేవర ఓవర్సీస్ రైట్స్…ఈ సినిమాతో ఎన్టీయార్ గట్టిగానే కొట్టబోతున్నాడా..?

కొరటాల శివ కూడా ఆచార్య డిజాస్టర్ తర్వాత తనని తను ప్రూవ్ చేసుకోవాలని చూస్తున్నాడు. అందుకే ఈ సినిమా మీద తన పూర్తి కష్టాన్ని పెట్టి దీనిని తెరకెక్కిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పుడు హంసిని ఎంటర్ టైన్ మెంట్స్ వాళ్ళు దేవర ఓవర్సీస్ రైట్స్ ని 27 కోట్లకు కొనుగోలు చేయడం తో ' దేవర ' సినిమా మీద అంచనాలు మరింత పెరిగిపోతున్నాయి.

Written By: , Updated On : January 27, 2024 / 12:29 PM IST
Devara
Follow us on

Devara: ఎన్టీఆర్ హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న దేవర సినిమా మీద రోజు రోజుకీ అంచనాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఎందుకంటే ఈ సినిమా మీద ఇప్పటికే ప్రేక్షకులందరికీ విపరీతమైన అంచనాలు అయితే ఉన్నాయి. దాంతో ఈ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ అవుతుందనే కాన్ఫిడెంట్ అందరిలో నెలకొంది. ఇక అందులో భాగం గానే ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత చేస్తున్న ఈ సినిమాతో తనని తను సోలో హీరోగా పాన్ ఇండియా లో ప్రూవ్ చేసుకోవాలని చూస్తున్నాడు.

ఇక కొరటాల శివ కూడా ఆచార్య డిజాస్టర్ తర్వాత తనని తను ప్రూవ్ చేసుకోవాలని చూస్తున్నాడు. అందుకే ఈ సినిమా మీద తన పూర్తి కష్టాన్ని పెట్టి దీనిని తెరకెక్కిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పుడు హంసిని ఎంటర్ టైన్ మెంట్స్ వాళ్ళు దేవర ఓవర్సీస్ రైట్స్ ని 27 కోట్లకు కొనుగోలు చేయడం తో ‘ దేవర ‘ సినిమా మీద అంచనాలు మరింత పెరిగిపోతున్నాయి. ఇక ఇంతకుముందు హంసిని ఎంటర్ టైన్ మెంట్స్ వారు ‘పుష్ప’ సినిమాని ఓవర్సీస్ లో రిలీజ్ చేశారు. ఇక ఇప్పుడు దేవర సినిమాని కూడా వాళ్లే రిలీజ్ చేస్తుండటం తో చాలామంది హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఓవర్సీస్ లో దేవర మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 5 మిలియన్ డాలర్ల నుంచి 5.5 మిలియన్ డాలర్ల వరకు కలెక్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. అలాగే సూపర్ హిట్ టాక్ వస్తే ఈ కలెక్షన్స్ రాబట్టడం పెద్ద కష్టమైతే కాదు. ఇక ఇప్పటికే చాలా సినిమాలు ఏ మాత్రం అంచనాలు లేకుండా వచ్చి సూపర్ హిట్స్ ని అందుకుని భారీ కలెక్షన్లను రాబడుతున్న సంఘటనలను మనం చూస్తూనే ఉన్నాం.

ఇక ఎన్టీఆర్ కి త్రిబుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియాలో కూడా మంచి మార్కెట్ అయితే ఏర్పడింది. అలాగే ఓవర్సిస్ లో కూడా తనకు మంచి మార్కెట్ ఉండడంతో ఈ సినిమా ఈజీగా బ్రేక్ ఈవెన్ అవుతుంది అనే ఉద్దేశ్యంలో సినిమా మేకర్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది… ఇక కొరటాల శివ ఈ సినిమాతో అటు ఎన్టీఆర్ కి, ఇటు తనకి హెల్ప్ అయ్యే విధంగా ఒక భారీ హిట్ కొట్టాలనే ఉద్దేశ్యం లో ఉన్నట్టుగా తెలుస్తుంది.