తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో రెండు లోక్‌సభ స్థానాల ఫలితాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. సీఎం రేవంత్‌రెడ్డి సొంత జిల్లా మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానంలో విజయం కాంగ్రెస్, బీజేపీ మధ్య దోబూచులాడుతోంది. ఇక మాజీ సీఎం సొంత జిల్లా మెదక్‌లో మెదక్ లోక్‌సభ స్థానంలో కూడా పరిస్థితి ఇలాగే ఉంది. ఇక్కడ 7వ రౌండ్ వరకు బీఆర్‌ఎస్, బీజేపీ మధ్య విజయం దోబూచులాడగా, ప్రస్తుతం కాంగ్రెస్, బీజేపీ మధ్య దోబూచులాడుతోంది. ప్రస్తుతం బీఆర్‌ఎస అభ్యర్థి వెంకట్రామిరెడ్డి మూడో స్థానానికి పరిమితమయ్యారు.
మహబూబ్‌నగర్‌లో ఇలా..
తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సొంత జిల్లా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా. లోక్‌సభ ఎన్నికల్లో ఇక్కడి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని భావించారు. ఇందుకోసం రాష్ట్రంలోని 12 స్థానాల్లో ఒకే సభ నిర్వహించిన రేవంత్‌రెడ్డి.. మహబూబ్‌నగర్ లోక్‌సభ పరిధిలో 7 సభలు, 3 రోడ్‌షోలు నిర్వహించారు. కానీ, ఇక్కడ గెలుపు అంత ఈజీగా కావడం లేదు. ఓడిపోయినా ఆశ్చర్య పోనవసరం లేదు. మొదటి రౌండ్ నుంచి వంశీచందర్‌రెడ్డి, డీకే. అరుణ మధ్య ఆధిక్యం మారుతూ వస్తుంది. ప్రస్తుతం డీకే.అరుణ 10 వేలకుపైగా లీడ్‌లో ఉన్నారు. మొదటి ఏడు రౌండ్లలో వందల్లోనే లీడ్ మారుతూ వచ్చింది.
మెదక్‌లో ఇలా..
ఇక మెదక్‌లో బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు, బీఆర్‌ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి మధ్య విజయం మొదటి ఏడు రౌండ్ల వరకు దోబూచులాడింది. ఇక్కడ పోస్టల్ బ్యాలెట్, మొదటి రౌండ్‌లో వెంకట్రామిరెడ్డి ఆధిక్యత కనబర్చారు. రెండో రౌండ్‌లో రఘునందన్ లీడ్‌లోకి వచ్చారు. తర్వాత మూడో రౌండ్‌లో మళ్లీ వెంకట్రామిరెడ్డి గెలిచారు. తర్వాత రఘునందన్‌రావు లీడ్‌లోకి వచ్చారు. ఐదో రౌండ్ తర్వాత వెంకట్రామిరెడ్డి మూడో స్థానానికి పడిపోయారు. రెండో స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు వచ్చారు. ప్రస్తుతం రఘునందన్‌రావు 17 వేల పైచిలుకు లీడ్‌లో కొనసాగుతున్నారు.