Chiranjeevi Congratulates To Major Team: మేజర్ మూవీ యూనిట్ పై మెగాస్టార్ ప్రశంసల కురిపించగా… ఆ చిత్ర నిర్మాత మహేష్ బాబు ఆనందం వ్యక్తం చేశారు. చిరంజీవికి కృతజ్ఞతలు తెలిపారు. జూన్ 3న విడుదలైన మేజర్ మూవీ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. పాన్ ఇండియా మూవీగా పలు భాషల్లో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటింది. ముఖ్యంగా దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఓ వీరుడి కథ వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించారని ప్రేక్షకులు అభినందిస్తున్నారు.

మేజర్ మూవీ పై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. మేజర్ చిత్ర యూనిట్ పై ప్రశంసల వర్షం కురిపించారు. ”మేజర్ కేవలం చిత్రం కాదు, ఒక భావోద్వేగం. దేశం కోసం ప్రాణాలు అర్పించిన గొప్ప వీరుడి కథ. మేజర్ మూవీలో సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ అద్భుతంగా ఆవిష్కరించారు. అందరూ చూడాల్సి చిత్రం. ఇలాంటి అర్థవంతమైన చిత్రం నిర్మించిన మహేష్ ని చూస్తుంటే గర్వంగా ఉంది. హీరో అడివి శేషు, దర్శకుడు శశి కిరణ్ తిక్కా, హీరోయిన్స్ సాయి మంజ్రేకర్, శోభిత దూళిపాళ్లకు కంగ్రాట్స్” అంటూ చిరంజీవి ట్విట్టర్ పోస్ట్ చేశారు.

అలాగే మేజర్ టీమ్ చిరంజీవిని నివాసానికి వెళ్లి ఆయన్ని కలవడం జరిగింది. వారిని చిరంజీవి స్వయంగా అభినందించారు. మేజర్ మూవీని ఉద్దేశిస్తూ చిరంజీవి చేసినా కామెంట్స్ పట్ల మహేష్ స్పందించారు. ”చిరంజీవి సర్ కి కృతఙ్ఞతలు. మీ ప్రశంసలతో మేజర్ మూవీ టీమ్ చంద్రుణ్ణి తాకినంత ఆనందంగా ఉంది” అంటూ ట్వీట్ చేశారు. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం మేజర్ చిత్రాన్ని ప్రశంసిస్తూ నోట్ విడుదల చేశారు.

సోనీ పిక్చర్స్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ కలిసి నిర్మించిన మేజర్ చిత్రానికి శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించారు. 26/11 ముంబయి టెర్రరిస్ట్ ల దాడిలో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా మేజర్ తెరకెక్కింది. ఉన్నికృష్ణన్ పాత్రలో అడవిశేష్ నటించారు. ఆయనకు జోడీగా సాయీ మంజ్రేకర్ నటించారు. విడుదలైన అన్ని భాషల్లో మేజర్ ఆదరణ దక్కిచుకుంది. మేజర్ వరల్డ్ వైడ్ రూ. 60 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు సమాచారం.