పెరిగే వయసు వేగాన్ని చూసి మనిషి ఎప్పుడు ఆశ్చర్యపోతుంటాడు. ముఖ్యంగా సినిమాల్లో నటించే బాలనటుల విషయంలో ఇలాంటి షాకింగ్ ఎక్స్ ప్రెషన్స్ ఎక్కువగా ఉంటాయి. అరె అప్పుడే ఆ పిల్లాడు ఇంత అయిపోయాడా ? అంటూ చాల కామెంట్స్ వినిపిస్తుంటాయి, ముఖ్యంగా చైల్డ్ ఆర్టిస్ట్ ల విషయంలో. ప్రభాస్ స్టార్ డమ్ ను పదిరెట్లు పెంచిన ఛత్రపతి సినిమాలో సూరీడు పాత్ర అందరికీ బాగా గుర్తుండిపోతుంది.
సూరీడు ఓ సూరీడు అంటూ సాగే ఆ సన్నివేశం మొత్తం సినిమాకే మెయిన్ ఎమోషనల్ సీన్ గా నిలుస్తోంది. ఒక విధంగా కథను పూర్తిగా మలుపు తిప్పే సన్నివేశం కూడా అదే. సూరీడు అనే చిన్న కుర్రాడిని రౌడీలు కొట్టి చంపడంతోనే సినిమాలో హీరో పాత్ర మారుతుంది. ఆవేశం కట్టలు తెంచుకుంటుంది. నిజానికి ఆ సన్నివేశం వచ్చే క్రమంలో ప్రేక్షకుడు ఎమోషనల్ అవుతాడు.

అయితే, ఇంతకీ ఈ సినిమాలో ఆ సూరీడు పాత్రలో నటించిన కుర్రాడు ఎవరు ? చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించిన ఆ కుర్రాడు పేరు ‘భశ్వంత్ వంశీ’. ఎంతో అమాయకంగా కనిపించి ఆకట్టుకున్న అతను, ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు. మరి దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా విడుదలై ఇప్పటికే 16 ఏళ్లు గడిచిపోయాయి.
‘భశ్వంత్ వంశీ’ కూడా చాల పెద్దవాడు అయిపోయాడు. మీసాలు గెడ్డాలతో గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు. ఇక ‘భశ్వంత్ వంశీ’కి ఛత్రపతి సినిమాలో అవకాశం ఎలా వచ్చింది అంటే.. ఆడిషన్స్ కోసం తన తండ్రితో కలిసి వెళ్ళాడు ‘భశ్వంత్ వంశీ’. అప్పటికే ముప్పై మంది వరకు పోటీలో ఉన్నారు.
కానీ, ‘భశ్వంత్ వంశీ’ మాత్రం మొదటి రౌండ్ లోనే సూరీడు పాత్రకు సెలక్ట్ అయిపోయాడు. అతని అమాయక చూపులకు రాజమౌళి ఫిదా అయిపోయి అతన్ని సెలెక్ట్ చేశాడు. మరి ఇప్పుడు అతను ఎలా ఉన్నాడో ఫోటోలో చూడండి.
