HomeNewsSai Dharam Tej: మెగా మేనల్లుడు సాయిధరమ్​ తేజ్​పై ఛార్జ్ షీట్​!

Sai Dharam Tej: మెగా మేనల్లుడు సాయిధరమ్​ తేజ్​పై ఛార్జ్ షీట్​!

Sai Dharam Tej: మెగా హీరో సుప్రీం సాయి ధరమ్ తేజ్​కు ఇటీవలే హైదరాబాద్​ దుర్గం చెరువు దగ్గర బైక్​ యాక్సిడెంట్ అయిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడి.. దాదాపు కొన్ని నెలల తర్వాత మెల్లగా కోలుకున్నారు. ప్రస్తుతం ఇంట్లోనే ఉంటూ రెస్ట్ తీసుకుంటున్నారు. కాగా, తాజాగా, ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ క్రమంలోనే తేజ్​కు పోలీసులు నోటీసులు పంపించారు. అయితే, ఈ నోటీసులపై ఇప్పటివరకు సాయి తేజ్​ స్పందించలేదని.. త్వరలోనే అతనిపై ఛార్జ్ షీట్​ దాఖలు చేసే అవకాశాలున్నాయని సైబరాబాద్​ పోలీసు కమిషనర్​ స్టీఫెన్​ రవీంద్ర తెలిపారు.

Sai Dharam Tej
Sai Dharam Tej

ప్రమాదం జరిగినరోజే కేసు నమోదు చేశామని.. అందువల్ల అతని లైసెన్స్, బైక్ ఆర్సీ, ఇన్సూరెన్స్​, పొల్యూషన్ డాక్యుమంట్లు ఇవ్వాలని కోరుతూ నోటీసులు పంపింంచగా.. తేజ్​ ఏ నోటీసులకు స్పందించలేదని అన్నారు. అందుకే అతనిపై యాక్షన్ తీసుకోనున్నట్లు స్పష్టం చేశారు. మరి ఈ విషయంపై మెగా మేనల్లుడు ఎలా స్పందింస్తాడో తెలియాల్సి ఉంది.

Also Read: Kaliyugam Movie: ‘కలియుగం’ ఎలా ఉంటుందో చూపిస్తానంటున్న జెర్సీ హీరోయిన్​

కాగా, ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఈ హీరో.. జనవరి నుంచి సినిమా షూటింగ్​ల్లోకి అడుగుపెట్టనున్నట్లు సమాచారం. ఇప్పటికే డైరెక్టర్ మారుతితో కథ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. కాగా, ఇటీవలే రిపబ్లిక్ సినిమాతో పలకరించిన ఈ యువహీరో.. చాలా కాలం తర్వాత మంచి హిట్ కొట్టాడు. అంతలోనే ఈ యాక్సిడెంట్​ జరిగిపోయింది. మళ్లీ తన సినిమాలో కొత్తదనాన్ని చూపిస్తూ ముందుకు దూసుకెళ్తాడేమో చూడాలి.

Also Read: Saipallavi: సాయిపల్లవిపై శ్యామ్​సింగరాయ్​ నిర్మాత ప్రశంసల వర్షం

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular