Bird Flu Alert: ఏపీలో( Andhra Pradesh) కోళ్ల పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో పడింది. వరుసగా కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. దీంతో పౌల్ట్రీ రైతులు ఆందోళనతో ఉన్నారు. ప్రధానంగా ఉభయగోదావరి జిల్లాల్లో కోళ్లు పెద్ద ఎత్తున మృత్యువాత పడుతున్నాయి. చనిపోయిన కోళ్లను భోపాల్ ల్యాబ్ కు తరలించగా సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. వాటి మృతికి వైరస్ కారణమని తేలింది. దీంతో ఆ రెండు జిల్లాల యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రజలకు కీలకమైన సూచనలు చేస్తోంది. తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం కానూరు అగ్రహారం లోని ఫారం నుంచి కోళ్లను సేకరించి గోపాల్ ల్యాబ్ కు తరలించారు. అయితే పంపించిన నమూనాల్లో రెండింటికి బర్డ్ ఫ్లూ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో కిలోమీటర్ వరకు ఆ ప్రాంతాన్ని ప్రకటించారు. అక్కడ మూడు ఫారాలు ఉండడంతో.. కోళ్లతో పాటు గుడ్లను పూడ్చేందుకు ప్రత్యేక బృందాలను నియమించారు. బర్డ్ ఫ్లూ తేలినచోట చికెన్ దుకాణాలు మూసివేయాలని ఆదేశించారు. చుట్టు పది కిలోమీటర్ల పరిధిలో మెగా పెట్టి పర్యవేక్షిస్తున్నారు.
* ప్రత్యేక జోన్ల ప్రకటన
అయితే బర్డ్ ఫ్లూ( bird flu ) నిర్ధారణ అయిన ప్రాంతంలో 10 కిలోమీటర్ల పరిధిని సర్వే లెన్స్ జోన్ గా నిర్ణయించారు. ఆ చుట్టుపక్కల గ్రామాల్లో పౌల్ట్రీలు ఉండడంతో పాటుగా కోళ్లు మృతి చెందడంతో ఆ పరిధిలో రెడ్ జోన్, పది కిలోమీటర్ల పరిధిలో సర్వే లెన్స్ జోన్లుగా గుర్తించాలని కలెక్టర్ ప్రశాంతి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో అత్యవసర సమావేశం నిర్వహించారు. వైరస్ వ్యాప్తి నివారణ, నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై అవసరమైన సూచనలు చేశారు. కలెక్టరేట్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ సైతం ఏర్పాటు చేశారు. అయితే ఇప్పుడు బర్డ్ ఫ్లూ అనేది రాష్ట్రవ్యాప్తంగా వైరల్ గా మారింది. దీంతో చికెన్ దుకాణాలు ఎక్కడికక్కడే మూతపడుతున్నాయి.
* కొనసాగుతున్న ఆంక్షలు
మరోవైపు ఉభయగోదావరి( Godavari district ) జిల్లాలో ఆంక్షలు కొనసాగుతున్నాయి. ముందు జాగ్రత్త చర్యగా అన్ని అంగన్వాడి కేంద్రాలకు వారం రోజులపాటు కోడిగుడ్ల సరఫరాను నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. అయితే కానూరు అగ్రహారం పరిధిలో మాత్రమే బర్డ్ ఫ్లూ అని తేలిందని.. మిగతా ప్రాంతాల్లో ఎక్కడా వెలుగు చూడలేదని పశుసంవర్ధక శాఖ అధికారులు చెబుతున్నారు. చాలాచోట్ల కోళ్లు మృతి చెందినప్పటికీ.. అవి వేరే కారణాలతో గుర్తించినట్లు చెప్పుకొస్తున్నారు. కోళ్ల మృత్యువాతతో ప్రజలు ఎటువంటి ఆందోళనలు చెందాల్సిన పనిలేదని చెబుతున్నారు.
* పశ్చిమగోదావరిలో సైతం
ఇంకోవైపు పశ్చిమగోదావరి( West Godavari ) జిల్లాలో కోళ్ళ మృత్యువాత కొనసాగుతోంది. చాలా రోజులుగా ఆ జిల్లాలో కోళ్లు మృత్యువాత పడుతూ వచ్చాయి. దీంతో అక్కడ కోళ్లను భోపాల్ ల్యాబ్ కు తరలించారు. అయితే వేల్పూరులో ఒక కోళ్ల ఫారం లో బర్డ్ ఫ్లూ సోకినట్లు జిల్లా కలెక్టర్ ప్రకటించడం సంచలనంగా మారింది. వెంటనే అధికారులు అప్రమత్తమయ్యారు. రెడ్ జోన్ తో పాటు సర్వే లైన్స్ జోన్లు ప్రకటించారు. అయితే ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. పెరిగిన ఉష్ణోగ్రతలతో ఈ వైరస్ బతకదని చెబుతున్నారు. ఎలాంటి ఇబ్బందులు ఉండవని అధికారులు చెప్పుకొస్తున్నారు. మొత్తానికైతే బర్డ్ ఫ్లూ కలకలం రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తోంది. దీంతో చాలామంది మాంసం గుడ్లను తిరస్కరిస్తున్నారు. అమ్మకాలు కూడా గణనీయంగా పడిపోయినట్లు వ్యాపారులు చెబుతున్నారు.