Bigg Boss Telugu 8: ఈ బిగ్ బాస్ సీజన్ పూర్తిగా తప్పుడు ట్రాక్ లో నడుస్తుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. హౌస్ నుండి వెళ్ళిపోవాలి అని కోరుకున్న వాళ్ళను, ఆపే ప్రయత్నం చేయకుండా చాలా తేలికగా వదిలేయడం కేవలం మణికంఠ విషయం లోనే కాదు, శేఖర్ బాషా విషయంలో కూడా జరిగింది. వీళ్లిద్దరు ఆడియన్స్ ఓటింగ్ ద్వారా ఎలిమినేట్ అవ్వలేదు, మేము హౌస్ లో ఉండలేకపోతున్నాం అని చెప్తేనే వీళ్ళను ఎలిమినేట్ చేసారు. అలాగే బిగ్ బాస్ హిస్టరీ లో ఎప్పుడూ లేని విధంగా మణికంఠ ఎలిమినేట్ అయ్యినప్పుడు కనీసం AV వీడియో కూడా వేయకపోవడం బిగ్ బాస్ నిర్లక్ష్యానికి తార్కాణం అని చెప్పొచ్చు. ఇలా ఎలా పడితే అలా తప్పుడు ట్రాక్ లో బిగ్ బాస్ షో వెళ్తోంది. ఇదంతా పక్కన పెడితే హౌస్ లో కొంతమంది కంటెస్టెంట్స్ ని మానసికరంగ్తా కృంగదీసే విధంగా ఉంటున్నాయి.
ఉదాహరణకి గత వారం అందరికంటే తక్కువ ఓట్లు దక్కించుకున్న కంటెస్టెంట్ పృథ్వీ. సోనీ టీవీ సంస్థ నుండి కొన్ని పీఆర్ టీమ్స్ కి వచ్చిన సమాచారం ఇదే. కానీ గౌతమ్ కి తక్కువ ఓట్లు పడ్డాయని చెప్పుకొచ్చింది స్టార్ మా టీం. ఎలాగో ఈరోజు మణికంఠ ఎలిమినేట్ అవుతున్నాడు, అవతల వైపు ఎవరిని డేంజర్ జోన్ లో పెడితే ఏముందిలే అని బిగ్ బాస్ టీం చాలా తేలికగా తీసుకొని ఉందేమో, అందుకే చాలా తేలికగా గౌతమ్ ని పెట్టేసారు అంటూ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పాపం గౌతమ్ తనకి తక్కువ ఓట్లు పడ్డాయని, మణికంఠ కారణంగా సేవ్ అయ్యి ఇంట్లో ఉన్నాను అనే ఫీలింగ్ అతన్ని ఘోరంగా బాధపడేలా చేస్తుంది. ఎంతో బలమైన కాంఫిడెన్స్ తో ఉండే గౌతమ్, ఈ సంఘటన తర్వాత పూర్తిగా డీలా పడ్డాడు. హౌస్ లో ఎవరితోనూ సంతోషంగా మాట్లడలేకపోతున్నాడు. అతను బాధపడుతున్న విషయాన్నీ గమనించిన యష్మీ చాలా వరకు ధైర్యం నింపేందుకు ప్రయత్నం చేసింది. గౌతమ్ మాట్లాడుతూ ‘ఎలిమినేట్ అయ్యి వెళ్లిపోయిన ఇంత బాధపడేవాడిని కాదు’ అంటూ చెప్పుకొచ్చాడు.
గత వారం నా వైపు నుండి నేను ఎంత బెస్ట్ ఇవ్వాలో, అంతకు మించే ఇచ్చాను, అయినా కూడా నేను ఆడియన్స్ కి ఎందుకు నచ్చలేదో అర్థం కావడం లేదు, వైల్డ్ కార్డు కంటెస్టెంట్ గా రావడం వల్ల ఆడియన్స్ నాకు పూర్తిగా దిస్ కనెక్ట్ అయ్యారేమో అని బాధపడ్డాడు. దీనికి యష్మీ సమాధానం చెప్తూ ‘ఏమి బాధపడకు..ఈ వారం మెగా చీఫ్ గా నిన్ను నువ్వు సమర్థవతంగా నిరూపించుకో, మరుసటి వారం కంటెండర్ గా బాగా ఆడు, కచ్చితంగా నువ్వు టాప్ ఓటింగ్ లోకి దూసుకొస్తావ్’ అంటూ ధైర్యం చెప్పింది. అయితే గౌతమ్ నామినేషన్స్ ప్రారంభం అయ్యే ముందు కెమెరా వద్దకు వెళ్లి ‘బిగ్ బాస్ మెగా చీఫ్ అయ్యినందుకు నన్ను నామినేషన్స్ నుండి మినహాయించొద్దు, దయచేసి నన్ను నామినేట్ అవ్వనివ్వండి, ప్రేక్షకులు ఓట్లు వేస్తేనే ఉంటాను, లేదంటే ఎలిమినేట్ అవుతాను’ అంటూ చెప్పుకొచ్చాడు.