Actor Venu: సినీ పరిశ్రమలో ఇటీవల కాలంలో చాలా మంది నటులు చనిపోతున్నారు. ఈ నేపధ్యంలో తాజాగా మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ మలయాళం నటుడు నేషనల్ అవార్డు విజేత నెడుమడి వేణు (73) కన్నుమూశారు. గత కొన్ని నెలలుగా లివర్ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన… తిరువనంతపురంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. క్రమంగా ఆరోగ్యం క్షీణించడంతో ఈరోజు మరణించినట్లు ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు.

ఆయన మృతి పట్ల మంజు వారియర్ , నివిన్ పౌలీ, అనుపమ పరమేశ్వరన్, దుల్కర్ సల్మాన్ , నజ్రియా నజిమ్ నివాళులు అర్పిస్తూ సోషల్ మీడియా లో పోస్ట్ చేశారు. 500కు పైగా చిత్రాల్లో నచించిన నెడుమడి వేణు… మలయాళంలో కొన్ని సినిమాలకు స్క్రీన్ రైటర్, దర్శకుడిగా వహించారు . టెలివిజన్ సీరియల్స్‌లోనూ నటించారు. శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు, అపరిచితుడు చిత్రాల్లో నెడుమడి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
దాదాపు 11 సంవత్సరాల తర్వాత వేణు తమిళ చిత్రం సర్వం తాళమయం మొదలైన చిత్రాలలో నటించారు. దీంతో ప్రస్తుతం తమిళ చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వేణు మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేశారు.