Bamboo Cultivation: ఒకప్పుడు దండగ అన్న వ్యవసాయం ఇప్పుడు సిరులు పండిస్తోంది. పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తూ.. కంపెనీలు స్థాపించిన వారు తమ స్థానాలను వదిలి వ్యవసాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. విదేశాల్లో ఉండేవారు సైతం తమ సొంత గ్రామాల్లోకి వచ్చి వ్యవసాయాన్ని వినూత్న పద్ధతుల్లో చేస్తూ అధిక ఆదాయం అర్జిస్తున్నారు. అయితే ఒకప్పుడు వ్యవసాయం అంటే వరి, పత్తి, మొక్కజొన్న వంటి పంటలు మాత్రమే కనిపించేవి. వీటికి కూడా నీరు అవసరం ఉండడంతో కొన్న ప్రాంతాల్లో మాత్రమే పండించేవారు. అయితే నీటి అవసరం లేకుండా.. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం వచ్చే కొన్ని Crops చాలా వరకు అందుబాటులోకి వచ్చాయి. వీటిలో వెదురు పంట ఒకటి. చాలా మందికి వెదురు పేరు చెప్పగానే అడవిలో కనిపిస్తుంది.. దీనిని పంట ఎలా అంటారు? అనే సందేహ వస్తుంది. కానీ దీనిని పంటగా చేయడం వల్ల ప్రతి ఏడాది లక్షకు మించి ఆదాయం వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. అదెలాగంటే?
భారత అటవీ చట్టం సవరణలో భాగంగా వెదురు సాగును 2017లో గడ్డి జాతిగా ప్రకటించారు. చాలా గ్రామాల్లో వెదురు కనిపిస్తుంది. కానీ దీని గురించి పెద్దగా పట్టించుకోరు. అయితే అటవీ ప్రాంతాలకు సమీపంలో ఉన్న గ్రామాల్లో వెదురును ప్రత్యేకంగా పెంచి వాటిని ఇంటి కర్రలు, ఇతర అవసరాలకు ఉపయోగించుకుంటారు. కానీ దీనిని పంటగా సాగు చేయడం వల్ల లాభాలు పొందవచ్చని వ్యవసాయ అధికారులు తెలుపుతున్నారు. ఈ సాగు ఎలా చేయాలంటే?
వెదురు సాగు కోసం ముందుగా మొక్కలను ఎంపిక చేసుకోవాలి. వీటిని ఒక ఎకరం లేదా అంతకు మించిన భూమిలో పండించుకోవచ్చు. ఒక ఎకరం భూమిలో దీని సాగు కోసం రూ.1.50 లక్షల ఖర్చు అవుతుంది. అయితే దీనిని నాటిన తరువాత 5 సంవత్సరాల పాటు వెయిట్ చేయాలి. ఈ ఐదేళ్ల పాటు మరో లక్ష నిర్వహణ ఖర్చు అవుతుంది. ఇలా మొత్తం రూ.2.50 లక్షల ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇలా 5 ఏళ్ల పాటు ఇది పెరిగిన తరువాత దాదాపు 40 సంవత్సరాల పాటు నిరంతర ఆదాయం వస్తుంది. ఇలా ప్రతి సంవత్సం రూ.1.5 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు ఆదాయం వస్తుంది.
అయితే వెదురు పంటను వరి, మొక్కజొన్నతో కలిసి సాగు చేయొచ్చా? అని కొందరు అనుకుంటారు. కానీ అలా పెంచలేం. దీనికి ప్రత్యేకంగా భూమి కావాల్సి ఉంటుంది. దీని ఆకులు అంత త్వరగా కుళ్లిపోలేవు. అందువల్ల ఇది మిగతా పంటలకు అడ్డుగా ఉంటుంది. అందువల్ల ప్రత్యేకంగా వెదురు సాగు చేయాలని అనుకునే వారు.. ఈ పంట వేసుకొని మరిచిపోయే వారికి అనుగుణంగా ఉంటుంది. అలాగే దీనిని అదనపు పంటగా భావించి ఖాళీగా ఉన్న భూమిలో సాగు చేసుకోవచ్చు. అయితే దీని కోసం ప్రత్యేకంగా సమయం కేటాయించాల్సిన అవసరం లేనందున కొందరు రైతులకు ఇది ఉపయోగకరంగా ఉంటుంది. వెదురు వల్ల చాలా రకాలుగా ఉపయోగాలు ఉన్నాయి. దీనిని ఇథనాల్, వెదరు కోసం ఉపయోగిస్తారు.