HomeNewsAurangabad: ప్రియుడి మోజులో.. భర్తపై ఇంత పైశాచికమా? ఔరంగాబాద్ లో మరో దారుణం..

Aurangabad: ప్రియుడి మోజులో.. భర్తపై ఇంత పైశాచికమా? ఔరంగాబాద్ లో మరో దారుణం..

Aurangabad: మేఘాలయ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తే.. తెలంగాణలోని ఉమ్మడి పాలమూరు జిల్లాలో జరిగిన సంఘటన దానిని మించిపోయింది. గద్వాల జిల్లాలో ఐశ్వర్య అనే యువతి తేజేశ్వర్ అనే తన భర్తను తిరుమలరావు అనే తన ప్రియుడి సహకారంతో అంతం చేసింది. అంతేకాదు అతడిని అంతం చేయడానికి ఐశ్వర్య నాలుగు సార్లు ప్రయత్నాలు చేసింది. ఐదవ ప్రయత్నంలో అతడిని భూమి మీద లేకుండా చేసింది. అతడిని అంతం చేయడానికి ఐశ్వర్య ఏకంగా వాహనానికి జిపిఎస్ ట్రాకర్ ఏర్పాటు చేయడం విశేషం. ఇక ఈ రెండు సంఘటనలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భర్తను ప్రియుడి తో కలిసి భార్య చంపింది. ఈ మూడు దారుణాలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసాయి. వీటిని మర్చిపోకముందే ఇప్పుడు మరో దారుణం వెలుగులోకి వచ్చింది..

ఇంతకీ ఏం జరిగిందంటే

బీహార్ రాష్ట్రంలోని ఔరంగాబాద్ లో ఓ మహిళ తన ప్రియుడితో కలిసి భర్తను అంతం చేసింది. తన భర్త పై కారు ఎక్కించి భూమ్మీద లేకుండా చేసింది. ఒంట్లో బాగోలేదని.. ఆసుపత్రికి వెళ్దామని తన భర్తను ఆమె తీసుకెళ్లింది. తన ప్రియుడి నడుపుతున్న కారును అద్దెకి తీసుకొని.. అందులో అతడిని ఆసుపత్రికి తీసుకెళ్ళింది. స్థానికంగా ఉన్న హాస్పిటల్లో చూపించుకుంది. ఆ తర్వాత మళ్లీ అదే కారులో తన భర్తతో కలిసి ఇంటికి ప్రయాణమైంది. ఇదే క్రమంలో ఆకస్మాత్తుగా కారు ఆగిపోవడంతో.. టైర్ పంచర్ అయిందో చూడమని తన భర్తకు చెప్పింది. అతడు కారు దిగి చూడగా.. వెంటనే తన ప్రియుడిని కారుతో అతడిని గుద్ది చంపాలని ఆదేశించింది. ఆమె చెప్పినట్టుగానే అతడు కారు వెంటనే స్టార్ట్ చేసి గుద్దాడు. రెండు మూడు సందర్భాలలో అలానే అతని మీద నుంచి కారును పోనిచ్చాడు. తీవ్ర గాయాలు అయిన అతడు అక్కడికక్కడే చనిపోయాడు. ఆ తర్వాత వారిద్దరు అక్కడి నుంచి పరారయ్యారు.. అయితే స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు సంఘటన స్థలానికి వచ్చారు. మృతుడి వద్ద ఉన్న ఆధారాలను సేకరించి వివరాలు తెలుసుకున్నారు. ఆ తర్వాత ఫోన్ డేటా పరిశీలించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఇక ఈ సంఘటన ఔరంగాబాద్ లో సంచలనం సృష్టించగా.. జాతీయ మీడియాలో ప్రముఖంగా ప్రసారం అవుతున్నది. ఇటీవల కాలంలో భర్తలపై భార్యలు చేస్తున్న దాడులు కలకలం సృష్టిస్తున్నాయి. వేరే వ్యక్తులతో సంబంధాలు ఏర్పరచుకొని.. భర్తలను అంతం దారుణాలు సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేస్తున్నాయి. ఔరంగాబాద్ ఘటనలో భర్తను అంతం చేసిన భార్యకు పిల్లలు ఉన్నారు. అయితే ఇటీవల కాలంలో ఆమెకు ఒక వ్యక్తితో పరిచయం ఏర్పడి.. కాస్త వివాహేతర సంబంధానికి తయారు చేసింది. చివరికి తన ప్రియుడి అండ చూసుకొని ఆమె భర్తను అంతం చేసింది.. ఈ సంఘటన సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేసింది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version