Andhra Pradesh Gold Mines: ఇటీవల కర్నూలు జిల్లాలో జొన్నగిరి ప్రాంతంలో దేశంలోనే అతిపెద్దదైన ప్రైవేట్ బంగారు గొనుల ప్రాజెక్టు ఉత్పత్తి మొదలైంది. 405 కోట్ల ఖర్చుతో ఇక్కడ బంగారాన్ని ఉత్పత్తి చేయడం మొదలుపెట్టారు. జొన్నగిరి ప్రాంతంలో తయారైన బంగారాన్ని బయటకు విడుదల చేశారు. బ్రాండ్ ఏపీ పేరుతో ఈ బంగారాన్ని విక్రయిస్తున్నారు. రాయల్టీ రూపం లో జొన్నగిరి ద్వారా భారీగానే ఏపీ ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది.
జొన్నగిరి వల్ల కర్నూలు జిల్లా స్వర్ణ గిరిగా మారిపోయింది. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ ఇప్పుడు మరో కేజీఎఫ్ ఆంధ్రప్రదేశ్లో వెలుగులోకి వచ్చింది. అది కూడా చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పంలోని గడుపల్లె మండలంలోని చిగురు గుంట ప్రాంతంలో ఉంది.
సరిగా 2001లో ఇక్కడ గోల్డ్ మైన్స్ మూతపడ్డాయి. ఇప్పుడు వాటిని తెరిపించేందుకు ఏపీ ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఇటీవల ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించింది. ఇందులో రెండు కంపెనీలు పాల్గొన్నారు. గతంలో 263 హెక్టార్లలో ఇక్కడి గనులు విస్తరించి ఉన్నాయి. తాజాగా నిర్వహించిన సర్వేలో మరో తొమ్మిది హెక్టార్లను ఇందులో కలిపారు. గత ఎడాది ఇక్కడి బంగారు నిక్షేపాలపై అధికారులు సర్వే చేశారు. నివేదిక కూడా అందించారు. ఆ నివేదిక ప్రకారం ఇక్కడ 18 లక్షల టన్నుల ముడి బంగారు ఖనిజం ఉండొచ్చని అధికారులు చెబుతున్నారు.. ఒక టన్ను ముడి ఖనిజం నుంచి దాదాపు 5.5 గ్రాముల బంగారం లభిస్తుంది. ఈ ప్రకారం అక్కడ 8.5 టన్నుల బంగారం ఉండవచ్చని సమాచారం. ఒకవేళ ఈ మైండ్స్ మళ్లీ మొదలయితే 5000 మందికి ఉపాధి లభిస్తుంది.
వాస్తవానికి ఈ గని ఇప్పటిది కాదు. దశాబ్దాల క్రితమే ఇక్కడ ముడి ఖనిజాన్ని తవ్వారు. అప్పట్లో గుడిపల్లె మండలంలో రెండు ప్రాంతాలలో గోల్డ్ మైన్స్ ఉన్నాయని గుర్తించారు. బిసానత్తం ప్రాంతంలో 1968, చిగురు గుంటలో 1978లో తవ్వకాలు మొదలుపెట్టారు. నాడు ఎంఈసిఎల్ సంస్థ ఆధ్వర్యంలో తవ్వకాలు ప్రారంభించారు. ఇక్కడ లభించే క్వార్జ్ రాయిని వెలికి తీసి.. విక్రయించడం మొదలుపెట్టారు. ఎంఈసిఎల్ దాదాపు 10 సంవత్సరాలపాటు క్వార్జ్ ను వెలికి తీసింది. నాడు కేజీఎఫ్ లోని భారత్ గోల్డ్ మైనింగ్ లిమిటెడ్ కు అందించింది. అయితే ఆర్థిక ఇబ్బందుల్లో ఈ సంస్థ చెప్పుకోవడంతో ఘనుల నిర్వహణ కష్టంగా మారింది. ఆ తర్వాత ఇక్కడి గనులను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ బీజీఎమ్ఎల్ 1982లో విక్రయించింది. 2001 వరకు ఇక్కడ బిజీ ఎంఎల్ సంస్థ ముడి ఖనిజాన్ని వెలికి తీసింది. ఆ తర్వాత అనేక సమస్యలు ఎదురు కావడంతో ఈ గనులను మూసివేస్తూ బిజిఎంఎల్ నిర్ణయం తీసుకుంది. ఈ గనులకు సంబంధించి 263b హెక్టార్ల భూమిని 2011లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంపిక చేసింది. బంగారం అన్వేషణలో భాగంగా 150 బోర్లు డ్రిల్ చేసింది.
