
ఏపీలో గత 24గంటల్లో 72,861కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 6,225కరోనా పాజిటివ్ వచ్చినట్లు ఏపీ ఆరోగ్య శాఖ ప్రకటించింది. రాష్టంలో ఒక్క రోజులో కొత్తగా 7,798 మంది కోలుకోగా… రాష్టంలో ఒక్క రోజులో 41మంది మృతి చెందినట్లు తెలిపింది. రాష్టంలో ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 5,941గా వుంది. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య55,282. దీనితో ఇప్పటివరకు రాష్టంలో వచ్చిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 7,13,014 గా నమోదు అయినట్లు తేలిపారు.