
ఆంధ్రప్రదేశ్ రాష్ర్టంలో బోగస్ చలాన్ల కుంభకోణం బయటపడింది. ప్రభుత్వ ఖజానాకు చేరాల్సిన కోట్ల డబ్బును తమ జేబుల్లో వేసుకున్నారు. సబ్ రిజిస్టర్ కార్యలయాల్లో సాగుతున్న అక్రమాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ వ్యవహారాలపై సమగ్ర దర్యాప్తు చేసేందుకు నిర్ణయించుకుంది. సాఫ్ట్ వేర్ లోపాలను ఆసరాగా చేసుకుని అక్రమాలకు పాల్పడుతున్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో బోగస్ చలాన్ల వ్యవహారం కల్లోలం కలిగిస్తోంది. రాష్ర్టంలో 35 సబ్ రిజిస్రార్ కార్యాలయాలపై ఉన్నతాధికారులు దాడులు నిర్వహించారు.
సాంకేతిక లోపాలే ఆసరాగా చేసుకుని కోట్లు కొల్లగొట్టినట్లు తెలుస్తోంది. సీఎఫ్ఎంఎస్ లోని తప్పులను అనుకూలంగా మలుచుకుని ఈ చలానాలను దారి మళ్లించినట్లు సమాచారం. సీఎష్ఎంఎస్, ఈ చలానా, ఈసీ, ఆర్ హెచ్, నకళ్లను సీనియర్ అసిస్టెంట్లు చేయాల్సి ఉన్నా వీటిని ప్రైవేటు లేఖరులతో రాయిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. ఈ దందాలో సబ్ రిజిస్రార్ లే ఉన్నారనే ఆరోపణలు సైతం వెల్లువెత్తుతున్నాయి. డాక్యుమెంట్ రైటర్లు కేవలం పాత్రధారులే అని తెలుస్తోంది.
కడప జిల్లాలోనూ ఈ తరహా మోసాలు బయటపడుతున్నాయి. కోట్టాది రూపాయలు కొల్లగొడుతూ ప్రజాధనాన్ని దారి మళ్లిస్తున్నారు. కడప అర్బన్ సబ్ ిజిస్రార్లు చంద్రమోహన్, సుబ్బారెడ్డి, అసిస్టెంట్ రత్నమ్మ తోపాటు కడప రూరల్ సబ్ రిజిస్రార్ హరికృష్ణ, అసిస్టెంట్ సుకుమార్ ను విధుల నుంచి తొలగించారు. కర్నూలు జిల్లా నంద్యాల సబ్ రిజిస్రార్ కార్యాలయంలోనూ ఇద్దరు ఉధ్యోగులపై వేటు వేశారు. సబ్ రిజిస్రార్ సోఫియా బేగం, జూనియర్ అసిస్టెంట్ వీరన్ను సస్పెండ్ చేశారు. నకిలీ చలానాలతో ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టినల్లు తేలడంతో వారిపై చర్యలు చేపట్టారు.
బోగస్ చలాన్ల అక్రమాలపై సీఎం జగన్ కూడా దృష్టి సారించారు. వ్యవహారాలపై దర్యాప్తు జరిపి నిజానిజాలు నిగ్గు తేల్చాలని ఆదేశాలు జారీ చేశారు. పక్కదారి పట్టిన నిధులు తిరిగి ప్రభుత్వానికి స్వాధీనం అయ్యేలా చర్యలు చేపట్టాలని సూచించారు. అక్రమార్కుల నుంచి ఇఫ్పటికే రూ.90 లక్షల మేర రాబట్టినట్లు తెలుస్తోంది. ఇంకా విచారణ జరిపి మొత్తం కుంభకోణంలో దారి మళ్లిన డబ్బులను తీసుకురావాలని చెప్పారు.