Allu ayan: గని ఆంథమ్​కు అల్లు అయాన్​ స్టంట్స్​

Allu ayan: మెగాప్రిన్స్​ వరుణ్​తేజ్ హీరోగా కిరణ్​ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా గని. ఇందులో సయీ మంజ్రేకర్​ హీరోయిన్​గా నటిస్తున్నారు. సిద్ధు ముద్ద, అల్లు బాబీ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా ఇది. బాక్సింగ్​ నేపథ్యంల సాగే కథ ఇది. కిరణ్​ కొర్రపాటి దర్శకత్వంలో రానున్న సినిమా ఇది. ఇటీవలే విడుదలైన ప్రోమో, పోస్టర్స్​, సాంగ్​లు సినిమాపై భారీ అంచనాలు నెలకొల్పాయి. మరోవైపు గని ఆంథమ్​ పేరుతో వచ్చిన లిరికల్​ వీడియో కూడా సూపర్​ హిట్​గా నిలిచింది. […]

Written By: Raghava Rao Gara, Updated On : November 8, 2021 1:31 pm
Follow us on

Allu ayan: మెగాప్రిన్స్​ వరుణ్​తేజ్ హీరోగా కిరణ్​ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా గని. ఇందులో సయీ మంజ్రేకర్​ హీరోయిన్​గా నటిస్తున్నారు. సిద్ధు ముద్ద, అల్లు బాబీ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా ఇది. బాక్సింగ్​ నేపథ్యంల సాగే కథ ఇది. కిరణ్​ కొర్రపాటి దర్శకత్వంలో రానున్న సినిమా ఇది. ఇటీవలే విడుదలైన ప్రోమో, పోస్టర్స్​, సాంగ్​లు సినిమాపై భారీ అంచనాలు నెలకొల్పాయి. మరోవైపు గని ఆంథమ్​ పేరుతో వచ్చిన లిరికల్​ వీడియో కూడా సూపర్​ హిట్​గా నిలిచింది. ప్రస్తుతం టాప్​ ట్రెండిగ్​లో ఒకటిగా ముందుకు దూసుకెళ్తోంది.

కాగా, ఈ ఆంథమ్​పై అల్లు అర్జున్​ కొడుకు అల్లు అయాన్ చేసిన స్టంట్స్​ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్​గా మారింది. జిమ్​లో వర్క్​ఔట్స్​ చేస్తున్నట్లు, చెమట చిందిస్తూ బాక్సింగ్​ చేస్తున్నట్లు వీడియోలో కనిపించాడు అయాన్​. దీంతో, అల్లు, మెగా అభిమానులు అయాన్​పై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.  ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్​గా మారింది.

మరోవైపు, ఈ సినిమాలో స్టంట్స్​కోసం హాలీవుడ్​కు చెందిన లార్నెల్​స్టోవల్​, వ్లాడ్​ రింబర్గ్​ వంటి వారిని బరిలోకి దింపినట్లు తెలుస్తోంది. ఇప్పటికే దాదాపు షూటింగ్​ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా.. డిసెంబరు 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. ముకుంద సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై.. కంచెతో భారీ స్థాయిలో అభిమానులను సొంతం చేసుకున్నారు వరుణ్ తేజ్​. ఆ తర్వాత ఎఫ్​2 సినిమాలో వెంకటేశ్​తో కలిసి కనిపించి అలరించారు. ఇప్పుడు బాక్సింగ్​ మాన్​గా కనిపించి మెప్పించేందుకు సిద్ధమవుతున్నారు. మరి ఈ సినిమా ఎంతమేరకు విజయం సాధిస్తుందో తెలియాలంటే విడుదల వరకు వేచి చూడాల్సిందే.