Allu Arjun: ఎన్టీయార్, రామ్ చరణ్ లను కలిపితే అల్లు అర్జున్ అంటున్నారు…నిజం గా ఆయనకి అంత సీన్ ఉందా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోల మధ్య ఎప్పుడు పోటీ ఉంటూనే వస్తుంది. పర్సనల్ విషయాల్లో వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నప్పటికి సినిమాల విషయంలో మాత్రం ఒక హీరోని మించి మరొక హీరో భారీ రికార్డులను క్రియేట్ చేయాలని చూస్తూ ఉండటం విశేషం... వీళ్ళ మధ్య ఫ్రెండ్లీ కాంపిటీషన్ ఉండడం కూడా మనం చూస్తూనే ఉన్నాం...

Written By: Gopi, Updated On : October 22, 2024 1:02 pm

Allu Arjun

Follow us on

Allu Arjun: ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా పుష్ప 2 ఫీవర్ నడుస్తుంది. పుష్ప సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలో తనదైన రీతిలో గుర్తింపును సంపాదించుకున్న అల్లు అర్జున్ ఇప్పుడు అంతకు మించిన సక్సెస్ కొట్టాలని చూస్తున్నాడు. అందుకే ఈ సినిమాతో మరోసారి ప్రేక్షకులు ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. ఇక సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న పుష్ప 2 సినిమా మీద ఇప్పటికే భారీ అంచనాలైతే ఉన్నాయి. మరి ఈ సినిమా డిసెంబర్ 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. ఇలాంటి సందర్భంలో ఈ సినిమా 1000 కోట్లకు పైన కలెక్షన్లు రాబడుతుంది అంటూ మేకర్స్ భారీ రేంజ్ లో ప్రమోషన్స్ అయితే చేస్తున్నారు. మరి దానికి తగ్గట్టుగానే ఈ సినిమాలో అంత కలెక్షన్స్ వచ్చే అంత స్టఫ్ ఉందా లేదా అని మరి కొంతమంది సినీ మేధావులు వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా పుష్ప 2 సినిమాతో భారీ సక్సెస్ దక్కుతుందని అల్లు అర్జున్ భావిస్తున్నాడు. త్రిబుల్ ఆర్ సినిమా కంటే కూడా ఈ సినిమా ఎక్కువ ప్రీ రిలీజ్ బిజినెస్ ని చేస్తుంది అంటూ కొన్ని ప్రమోషన్స్ అయితే చేస్తున్నారు.

ఇక ఎన్టీఆర్, రామ్ చరణ్ ని కలిపితే ఎంత బిజినెస్ అయితే అయిందో ఒక అల్లు అర్జున్ మీద అంత బిజినెస్ జరగడంతో ఎన్టీయార్ రామ్ చరణ్ కంటే అల్లు అర్జున్ గ్రేట్ అంటూ కొంతమంది ప్రజలు ప్రోజక్ట్ చేసే ప్రయత్నంలో ఉన్నారు. నిజానికైతే పుష్ప 2 సినిమాకు ఆ రేంజ్ లో నిజంగానే బిజినెస్ జరిగిందా లేదంటే వీళ్ళు ఫేక్ అనౌన్స్ మెంట్ ఇచ్చారా అనేది కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది.

ఇక ఇది చూసిన చాలామంది జనాలు మాత్రం అల్లు అర్జున్ అంటేనే కొంచెం అతి చేస్తూ ఉంటాడు. ఆయన చెప్పిందాంట్లో చేసేదాంట్లో ఏది నిజమైతే ఉండదు. అందులో చాలా వరకు ఫేక్ ముచ్చట్ల ఉంటాయి కాబట్టి ఈ ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఫేక్ అంటూ కొంతమంది దీనిని కొట్టి పారేస్తున్నారు. నిజానికి రామ్ చరణ్, ఎన్టీఆర్ లను కొట్టేంత దమ్ము అల్లు అర్జున్ కి ఉందా అంటూ మరి కొంతమంది ప్రశ్నిస్తున్నారు.

ఇక ఏది ఏమైనా కూడా అల్లు అర్జున్ మాత్రం ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో నెంబర్ వన్ హీరోగా ఎదగాలనే ప్రయత్నంలోనే తన అడుగులను ముందుకు వేస్తున్నాడు. ఇక పుష్ప సినిమాతో ‘నేషనల్ అవార్డు’ ని అందుకున్న ఆయన ఇప్పుడు అంతకుమించి గుర్తింపును సంపాదించుకోవాలని చూస్తున్నాడు…