HomeNewsAI Drones Guns: ఏఐ గన్స్ వచ్చేశాయి.. ఇక కశ్మీర్ లో పాక్, చైనాకు దబిడదిబిడే..

AI Drones Guns: ఏఐ గన్స్ వచ్చేశాయి.. ఇక కశ్మీర్ లో పాక్, చైనాకు దబిడదిబిడే..

AI Drones Guns: అటు పాకిస్తాన్..ఇటు చైనా.. అటువైపు బంగ్లాదేశ్.. మొత్తంగా చూస్తే చుట్టూ శత్రు దేశాలే. ఇక అమెరికా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. యూరోపియన్ యూనియన్.. మాల్దీవులు.. వంటి దేశాలు మనతో ఎలా ఉంటాయో కూడా తెలుసు. ఇక ఇప్పుడు యుద్ధాల కాలం నడుస్తోంది. గిట్టని దేశాలు విచ్చలవిడిగా బాంబులు వేస్తున్నాయి. అడ్డగోలుగా దాడులు చేస్తున్నాయి.

మనం ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న దేశంగా పేరు తెచ్చుకున్నాం.. ప్రపంచ వ్యాప్తంగా అతిపెద్ద వినియోగదారుల మార్కెట్ ఉన్న దేశంగా కూడా అవతరించాం. ఇలాంటి పరిస్థితుల్లో మనం కచ్చితంగా మనల్ని కాపాడుకోవాలి. శత్రు దేశాల నుంచి రక్షించుకోవాలి. అందువల్లే రక్షణ రంగాన్ని బలోపేతం చేసుకునే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. ఇటీవల కాలంలో పాకిస్తాన్ దేశంపై చేపట్టిన ఆపరేషన్ సిందూర్ ద్వారా మన రక్షణ సామర్థ్యం ఎలా ఉందో ప్రపంచ దేశాలకు చాటి చెప్పాం. అయితే ఇక్కడితోనే సరిపోదు. ఎందుకంటే రక్షణ రంగంలో ఒక పట్లగా క్షిపణులను.. ఇతర వ్యవస్థలను ప్రయోగించే రోజులు లేవు. మనుషులు లేకుండా.. మనుషులతో అవసరం లేకుండా యుద్ధాలు చేసే రోజులు వచ్చేసాయి. స్థూలంగా చెప్పాలంటే అత్యధిక సాంకేతిక పరిజ్ఞానంతో పనిచేసే ఆయుధాలను ప్రపంచ దేశాలు తయారు చేస్తున్నాయి.రక్షణ వ్యవస్థ కోసం ప్రతి సంవత్సరం వేలకోట్లు ఖర్చు పెడుతున్న భారత్.. ఈసారి రక్షణ రంగంలో అత్యాధునిక మార్కులను తీసుకురావడానికి సంకల్పించింది. ఇందులో భాగంగానే ప్రస్తుత సాంకేతిక కాలంలో విశేషమైన ప్రాచుర్యం పొందిన కృత్రిమ మేధను రక్షణ రంగంలోకి అనుసంధానించాలని నిర్ణయించుకుంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టు కోసం భారత్ 100 కోట్లు కేటాయించినట్లు తెలుస్తోంది. అంతేకాదు మేకిన్ ఇండియా డిఫెన్స్ ఎక్విప్మెంట్ ప్రొడక్షన్ ప్లాన్ లో భాగంగా భారత్ ఈ విధంగా కేటాయింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో 1.75 లక్షల కోట్ల ఉత్పత్తులను రూపొందించాలని భారత్ భావిస్తోంది. తొలి దశలో 35వేల కోట్ల విలువైన రక్షణ పరికరాలను జగమతి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఎగుమతులు మాత్రమే కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటిలిజెంట్ సహాయంతో రక్షణ సామర్థ్యాన్ని పెంపొందించుకోవడానికి భారత సమర్థవంతమైన ప్రణాళిక రూపొందించింది. ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ ద్వారా పనిచేసే ఆయుధాలను తయారు చేయనుంది. ఇవి మన దేశం సైన్యాలకు ఉపయోగపడే విధంగా ప్లాన్ చేస్తోంది..

ఇప్పటికే డ్రోన్లను సొంతంగా తయారు చేసుకుంటున్నాం. మనుషులు లేకుండా భూగర్భ వాహనాలను.. స్వయంగా నడిచే జలాంతర్గములను రూపొందించుకున్నాం. అయితే ఇక్కడితోనే కాకుండా కృత్రిమ మేధ ఆధారంగా పనిచేసే రక్షణ పరికరాలను తయారు చేసే పనిలో పడ్డాం. ఇప్పటికే భారత సైన్యం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా నడిచే మిషన్ గన్స్ ను ఇటీవల పరిశీలించింది. బెంగళూరు నగరానికి చెందిన బి ఎస్ ఎస్ సంస్థ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో నడిచే మిషన్ గన్స్ రూపొందించింది.. ఈ గన్స్ స్వయం ప్రతిపత్తి వ్యవస్థ ఆధారంగా పనిచేస్తాయి. ఇవి యుద్ధభూమిలో దిగాలంటే ప్రత్యర్థులకు చుక్కలు కనిపిస్తాయి. మనుషుల అవసరం లేకుండానే ఇవి పనిచేస్తాయి. శత్రువులపై విరోచితంగా పోరాటం చేస్తాయి. ఈ గన్స్ వల్ల యుద్ధ భూమిలో ప్రాణనష్టం తక్కువగా ఉంటుందని రక్షణ రంగాన్ని పనులు చెబుతున్నారు.. 7.62 x51 మిల్లీమీటర్ బ్యారెల్ ను దీనికి అమర్చారు. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేస్తుంది. దీనిని లైట్ మిషన్ గన్ అని బిఎస్ఎస్ సంస్థ చెబుతోంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular