https://oktelugu.com/

Hyderabad: గ‘మత్తు’ జీవితాలు.. స్నేహితుడు నీట మునిగినా వీడియో తీస్తూ పైశాచికానందం..

హైదరాబాద్‌ చాంద్రాయణగుట్ట, బండ్లగూడ ప్రాంతానికి చెందిన సాజిద్, గోటి, అవుగోమా, తాజొద్దీన్‌ నలుగురు మంచి స్నేహితులు. వృత్తిరిత్యా ఆటో నడుపుతారు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : May 23, 2024 / 12:32 PM IST

    Hyderabad

    Follow us on

    Hyderabad: నలుగురు స్నేహితులు మందు పార్టీ చేసుకున్నారు. పీకలదాకా తాగారు.. స్నేహమేరా జీవితం అంటూ కబుర్లు చెప్పుకున్నారు. తర్వాత అందరూ కలిసి స్విమ్మింగ్‌ చేయడానికి వెళ్లారు. మద్యం మత్తులో ఒళ్లు తెలియకుండా ప్రవర్తించారు. ఈత కొడుతూ వీడియోలు తీసుకుంటూ ఎంజాయ్‌ చేశారు. కానీ చివరకు ఓ మిత్రుడు అందరూ చూస్తుండగానే కన్నుమూశాడు. ఈ విషాద ఘటన కర్నాటకలోని చెడుగుప్పలో జరిగింది.

    హైదరాబాద్‌ నుంచి బెంగళూరు వెళ్లి..
    హైదరాబాద్‌ చాంద్రాయణగుట్ట, బండ్లగూడ ప్రాంతానికి చెందిన సాజిద్, గోటి, అవుగోమా, తాజొద్దీన్‌ నలుగురు మంచి స్నేహితులు. వృత్తిరిత్యా ఆటో నడుపుతారు. ప్రవృత్తిగా గంజాయి కూడా విక్రయిస్తారు. ఈ మధ్య నలుగురు కర్నాటకలోని చెడుగుప్ప ప్రాంతానికి వెళ్లారు. అక్కడ ఫుల్లుగా మద్యం తాగారు. అదే మైకంలో సమీపంలో ఉనన కెనాల్‌లో ఈత కొట్టేందుకు వెళ్లారు. ముగ్గురు ఫ్రెండ్స్‌ కాలువలో దూకారు. సాజిద్‌ రానని చెప్పినా వినిపించుకోకుండా టెంప్ట్‌ చేశారు. అయిష్టంగానే కాలువలోకి దూకిన సాజిద్‌ నిమిషాల వ్యవధిలోనే మునిగిపోతూ కనిపించాడు.

    పైశాచిక ఆనందం..
    అయితే అందరూ ఫుల్లుగా మద్యం తాగి ఉండడంతో సాజిద్‌ మునిగి పోతున్నా పట్టించుకోలేదు. పైగా ఆ దృశ్యాన్ని వీడియో దీస్తూ పైశాచిక ఆనందం పొందారు మిగతా ముగ్గురు. సాజిద్‌ను కాపాడాలన్న సోయి లేకుండా ప్రవర్తించారు. దీంతో సాజిద్‌ నీటమునిగి మరణించాడు. అయితే తామేదో ఘనకార్యం చేశామన్నట్లు తాము తీసిన వీడియోను సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. ఈ వీడియో పోలీసుల కంట పడడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

    గంజాయి మైకంలోనే..
    నలుగురు గంజాయి విక్రయించడంతోపాటు సేవిస్తారని కూడా భావిస్తున్నారు. మద్యం తాగిన తర్వాత గంజాయి కూడా సేవించి ఉండడంతో వారు విపరీతమైన మత్తులో ఒళ్లు తెలియకుండా ప్రవర్తించారని పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు సాజిద్‌ మరణాన్ని కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. సాజిద్‌ మరణంతో తమకు ఆధారం లేకుండా పోయిందని కన్నీరుమున్నీరవుతున్నారు.