Tihar Jail: తీహార్ జైలు గురించి మీకు తెలిసే ఉంటుంది. చాలా కేసుల్లో ఈ జైలు గురించి ప్రస్తావన వస్తుంటుంది. ఇక ఈ జైలుకు వెళ్తే తిరిగి రావడం కష్టం అని కూడా అంటారు. అంతేకాదు తీహార్ జైలు అంటే.. చాలా భయంకరమైన ప్రాంతమని.. చాలా మంది అంటుంటారు. కానీ.. కొన్ని సంస్కరణలకు పురుడు పోసుకున్న స్థానమే తీహార్ జైలు. ఈ జైలు దక్షిణ ఆసియాలోనే అతిపెద్ద. తీహార్ ప్రాంతంలో ఉన్న ఈ జైలుకు తీహార్ జైలు అని పేరు వచ్చింది. ఇది ఢిల్లీలోని చాణక్యపురి నుంచి 7 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
ఇందులో ఏకంగా దాదాపు 10 వేల మంది ఖైదీలకు సరిపోయే వసతులున్నాయి. కానీ ఈ సంఖ్యకు మించి ఇందులో ఖైదీలు ఉంటారు. మన దేశ మొట్టమొదటి ఐపీఎస్ అధికారిణి కిరణ్ బేడీ గురించి కూడా మీకు తెలిసే ఉంటుంది. ఈ అధికారిణి ఇక్కడ నుంచే సంస్కరణలు మొదలుపెట్టారు. ఎంతో మంది రాజకీయ నేతలకు, పారిశ్రామిక వేత్తలు, హంతకులు, ఉగ్రవాదులకు, ఉద్యమ నాయకులు కూడా ఈ జైలుకు వచ్చారు. వారికి ఆశ్రమం కల్పించింది. అందుకే దీన్ని ‘తీహార్ ఆశ్రమం’ అంటుంటారు.
మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హత్య కేసు గురించి మీకు తెలిసే ఉంటుంది. ఈ కేసులో అత్యంత కీలకులైన కేహార్ సింగ్, సత్వంత్ సింగ్‌లను ఇక్కడే నిర్భందించారువ. కేంద్ర మాజీ మంత్రి ఎం.కె. కనిమొళిలను 2జీ కేసులో అరెస్ట్ చేసి ఇక్కడే ఉంచారట. ఇదిలా ఉంటే తీహార్ జైలులో ప్రస్తుతం 15 వేల మందికి పైగా ఖైదీలు ఉంటున్నారు అని టాక్. వారందరికీ ఆహారం పెట్టడం చాలా కష్టతరమైన పనే కదా. వీరికి వంట చేయడానికి 4 వంటగదులు ఉంటాయట. వేసవి సమయంలో.. ఈ వంటగది చాలా వేడిగా.. ఉంటుంది కూడా.
ఇందులో వంట చేయడానికి.. సిబ్బంది, ఖైదీలు చాలా ఇబ్బంది పడుతుంటారు అని టాక్. అలాగే.. ఖైదీలకు ఉదయం 5 గంటలకు అల్పాహారం పెడతారట. అందులో.. రోటీలు, చపాతీలు, పూరీలు, పప్పును కూడా పెడతారు. ఇక మధ్యాహ్నాం 12 గంటలకు పప్పు, అన్నం, సబ్జీ, పెథా పెడతారు అని తెలుస్తోంది. రాత్రికి కూడా ఇదే మెనూ ఉంటుందట. వారానికి రెండు సార్లు ఖీర్ ను ఇస్తుంటారట..మరో విషయం ఏంటంటే మాంసం కూడా ఇక్కడ లభిస్తుంది. కానీ ఫ్రీగా ఖైదీలకు వడ్డించరట. కష్టపడి వారే సంపాదించి తినాల్సిందే.