https://oktelugu.com/

అమెరికాలో 50 శాతం మందికి పూర్తిస్థాయి టీకా

అమెరికా జనాభాలో సగం మందికి పూర్తిస్థాయి కొవిడ్ వ్యాక్సిన్ అందిందని శ్వేతసౌధం ప్రకటించింది. కరోనా డెల్టా రకం అగ్రదేశాన్ని మరోసారి కలవరపెడుతున్న నేపథ్యంలో వ్యాక్సినేషన్ ను ఇటీవల వేగవంతం చేశారు. ఈ క్రమంలోనే తాజా మైలురాయిని చేరుకున్నారు. ఈ విషయాన్ని శ్వేతసౌధంలో  వ్యాక్సినేషన్ సమాచార విభాగానికి డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న సైరస్ షాపర్ ప్రకటించారు. అమెరికాలో ఇప్పటి వరకు 165 మిలియన్ల మందకి రెండు డోసుల మోడెర్నా లేదా ఫైజర్ టీకా అందింది. ఇక మొత్తం జనాభాలో […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : August 7, 2021 11:12 am
    Follow us on

    అమెరికా జనాభాలో సగం మందికి పూర్తిస్థాయి కొవిడ్ వ్యాక్సిన్ అందిందని శ్వేతసౌధం ప్రకటించింది. కరోనా డెల్టా రకం అగ్రదేశాన్ని మరోసారి కలవరపెడుతున్న నేపథ్యంలో వ్యాక్సినేషన్ ను ఇటీవల వేగవంతం చేశారు. ఈ క్రమంలోనే తాజా మైలురాయిని చేరుకున్నారు. ఈ విషయాన్ని శ్వేతసౌధంలో  వ్యాక్సినేషన్ సమాచార విభాగానికి డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న సైరస్ షాపర్ ప్రకటించారు.

    అమెరికాలో ఇప్పటి వరకు 165 మిలియన్ల మందకి రెండు డోసుల మోడెర్నా లేదా ఫైజర్ టీకా అందింది. ఇక మొత్తం జనాభాలో 58.4 శాతం అంటే 193 మిలియన్ల మందికి కనీసం ఒక డోసు టీకా అందింది. తాజాగా మరోసారి అమెరికాలో రోజువారీ కేసులు పెరుగుతున్నాయి. డెల్టా వేరియంట్ విజృంభిస్తుండడంతో న్యూయార్క్ లాస్ ఏంజిల్స్ సహా కొన్ని కీలక ప్రాంతాల్లో మరోసారి ఆంక్షలు విధించారు.