ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 64,354 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 538 మందికి కరోనా నిర్ధారణ అయింది. ఇద్దరు బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 8,73,995కు చేరింది. గడిచిన 24 గంటల్లో 558 మంది బాధితులు పూర్తిగా కోలుకోగా.. ఇప్పటివరకు కోలుకొని 8,61,711 మంది ఇళ్లకు వెళ్లిపోయారు. తాజా మరణాలతో కలిపి రాష్ట్రంలో 7,047 మంది కొవిడ్‌తో మృతి చెందారు. రాష్ట్ర వ్యాప్తంగా 5,237 యాక్టివ్ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 1,06,35,197 కరోనా సాంపుల్స్‌ని వైద్యారోగ్య శాఖ పరీక్షించింది.
