Farm Shed: వ్యవసాయం ఒకప్పటి లాగా లేదు. కూలీల అవసరం లేకుండానే యంత్రాల సహాయంతో పొలాలను దున్నేస్తున్నారు. డ్రిప్, బిందు సేద్యం, సూక్ష్మ నీటి సేద్యం ద్వారా టన్నులకొద్ది పంటలు పండిస్తున్నారు. విదేశాలకు మాత్రమే పరిమితమైన పంటలను ఇక్కడ కూడా పండిస్తూ సరికొత్త చరిత్రను సృష్టిస్తున్నారు. డ్రాగన్ ఫ్రూట్, అవకాడో, లిచి, వంటి పంటలను పండిస్తూ సరికొత్త ఘనతలను నెలకొల్పుతున్నారు.. వ్యవసాయం కూడా సరికొత్త మార్పులకు గురి అవుతున్న నేపథ్యంలో.. కొత్త కొత్త సదుపాయాలు అందుబాటులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యమైనది ఫామ్ షెడ్.. దీనినే పొలం దగ్గర ఇల్లు అని అంటున్నారు.
ప్రతిదీ వ్యాపారమే
ప్రస్తుత కాలంలో ప్రతిదీ వ్యాపారమైపోయింది. కార్పొరేట్ కంపెనీలు కొత్త కొత్త అవసరాలను సృష్టిస్తూ.. కొత్త కొత్త నిర్మాణాలను చేపడుతున్నాయి. ఇందులో బాగానే ఫామ్ షెడ్ ను అందుబాటులోకి తీసుకొచ్చాయి. వెనుకటి కాలంలో పొలం దగ్గర రైతులు చిన్నచిన్న రేకుల షెడ్లు వేసుకునే వాళ్ళు. వర్షం వచ్చినప్పుడు అందులోకి వెళ్లేవాళ్లు. తమ పంట ఉత్పత్తులను అందులో నిల్వ చేసుకునేవాళ్లు. ఇప్పుడు కాలం మారింది.. ఒకప్పటిలాగా వ్యవసాయం లేదు. రైతులు కూడా ఎక్కువగా శారీరక శ్రమ చేయడాని తగ్గించారు. ఈ క్రమంలో ఉన్నంతసేపు పొలంలోనూ హాయిగా పని చేసుకోవడాన్ని ఇష్టపడుతున్నారు. అలసట అనిపించినప్పుడు విశ్రాంతి తీసుకోవడానికి పరితపిస్తున్నారు. అలాంటి వాళ్ల కోసం ఓ కంపెనీ ఫామ్ షెడ్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్రకారం పొలం దగ్గరే రెండు గదుల విస్తీర్ణంలో ఇనుము, ప్లాస్టిక్, ఫైబర్ తో నిర్మాణాన్ని చేపడతారు. ఇందులో బాత్ రూమ్, వాష్ రూమ్, లివింగ్ రూమ్, బెడ్ రూమ్ వంటి సౌకర్యాలు ఉంటాయి. పొలంలోని పంప్ ద్వారా ఈ షెడ్ కు నీటి సౌకర్యాన్ని కల్పించుకోవచ్చు. కరెంటు సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. పైగా దీనిని ఎక్కడికంటే అక్కడికి మార్చుకోవచ్చు. దీని ధర 3లక్షల లోపు ఉంటుంది. అయితే చూడటానికి ఇది కార్పొరేట్ భవనం లాగా కనిపిస్తుంది. అమెరికాలో వ్యవసాయ క్షేత్రంలో రైతులు ఇలాంటి చిన్న చిన్న భవనాలలోనే ఉంటారు. దానికివారు ఫామ్ షెడ్ అనే పేరుతో వ్యవహరిస్తారు. అయితే కొంతకాలంగా రెండు తెలుగు రాష్ట్రాలలోనూ ఇలాంటి నిర్మాణాలు పెరిగిపోయాయి. రైతుల అవసరాల ఆధారంగా కొన్ని కొన్ని కంపెనీలు వీటిని ఏర్పాటు చేస్తున్నాయి. అయితే వీటిపై కొంతమంది పెదవి విరుస్తున్నారు. ఇలాంటి నిర్మాణాల కోసం రైతులు అన్ని లక్షలు ఖర్చు చేయగలరా? అంత సామర్థ్యం రైతులకు ఉంటుందా? ఫామ్ షెడ్ అనేది కొత్త కల్చర్. వెస్ట్రన్ కంట్రీస్ లో ఇలాంటి నిర్మాణాలు సాధారణం. అలాంటివి ఇక్కడ వర్కౌట్ కావు. అంత ధర పెట్టి ఇక్కడ రైతులు నిర్మించుకుంటారా” అని కొంతమంది నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.