Palki Sharma Upadhyay: ఆ బ్రిటిష్ బ్రాడ్ కాస్ట్ కార్పొరేషన్ స్థూలంగా చెప్పాలంటే బీబీసీ… ఆ వెస్ట్రన్ మీడియా మొదటి నుంచి భారత్ మీద అక్కసు వెళ్ళగక్కుతూనే ఉంటుంది. కాశ్మీర్ భారతదేశానికి చెందదని, పాకిస్తాన్ కు మాత్రమే హక్కు ఉందని వాదిస్తుంది. ఇదే సమయంలో బ్రిటిష్ సైనికుల పైశాచికత్వాన్ని, ఈస్ట్ ఇండియా కంపెనీ దురాగతాన్ని దాచేస్తుంది.. మదర్ థెరీసా ను గొప్పగా చిత్రీకరించి… కర్ణాటకలో లక్షలాదిమందికి విద్య దానం చేస్తున్న శివ స్వామి గురించి అభాండాలు ప్రచారం చేస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఆ సో కాల్డ్ మీడియా ఏజెన్సీ కథలు చాలానే ఉన్నాయి.. ఇండియాలో ఒక సెక్షన్ కు ఈ సో కాల్డ్ బిబిసి అంటేనే ఇష్టం.. ఎందుకంటే అది యాంటీ మోడీ ప్రచారం చేస్తుంది కనుక.
అప్పట్లో గుజరాత్ లో జరిగిన అల్లర్లపై బీబీసీ మోడీపై ఒక డాక్యుమెంటరీ చిత్రీకరించింది.. దాన్ని రెండు భాగాలుగా విభజించి… ఒకదానిని ప్రసారం చేసింది. అయితే దీనిపై భారత ప్రభుత్వం అనేక అభ్యంతరాలు వ్యక్తం చేసింది.. దానిని ప్రసారం చేయకుండా నిషేధించింది.. ఇలాంటి సమయంలో కొన్ని మీడియా సంస్థలు బిబిసి పల్లవి అందుకున్నాయి.. ఇక బంగారు తెలంగాణలో అయితే నమస్తే తెలంగాణ పేజీల కొద్దీ వార్తలు, టీ న్యూస్ లో పొద్దంతా దానిపైనే చర్చలు నడిచాయి. సరే ఇదంతా ఒక కోణం. కానీ ఇలాంటి సమయంలోనే ఆ బీబీసీ బట్టలను ఈ న్యూస్ ప్రజెంటర్ ఇప్పేశారు. దాని అసలు ముఖాన్ని నడి బజార్లో నిలబెట్టారు..
పాల్కి శర్మ… ఇంగ్లీష్ టీవీల్లో న్యూస్, విశ్లేషణలు బాగా చేస్తారు.. ఆమె వ్యాఖ్యలకు క్రెడిబిలిటీ ఉంది.. తెలుగు టీవీలో న్యూస్ విభాగాలు పనిచేసే స్టాఫ్, రుధిర ప్రజెంటర్లు, పౌడర్ దిగ్గజాలు, పోస్కో పెద్ద తలకాయలు గట్రా ఆమెకు కనీసం ఓ 100 మైళ్ళ దూరంలో ఉంటారేమో… హై పిచ్ లో అరిచే ఆర్నబ్ కన్నా కూడా రెట్లు నయం ఆమె. ఎన్డీ టీవీ ని తీసేసుకున్న ఆదాని ఆమెను న్యూస్ హెడ్ గా చేయబోతున్నాడని అప్పట్లో వార్తలు వచ్చాయి కదా! మంచి నిర్ణయమని అప్పట్లో అందరూ అభిప్రాయపడ్డారు. కానీ ఆమె వెళ్ళలేదు.. బహుశా ఏమైనా టర్మ్స్ కుదరలేదేమో.. ఫస్ట్ పోస్ట్ లో చేరింది.. దానికి పాల్కి శర్మ పెద్ద బూస్టర్.. కానీ ఆమెకు ఇందులో చేరడం వల్ల ప్రయోజనం లేదు.. తన ఇమేజిని పోగొట్టుకోవడమే.. ఆమె సొంతంగా యూట్యూబ్ ఛానల్ పెట్టి, వార్తా వ్యాఖ్యలు గనుక చేస్తే ఎక్కువ రీచ్, ఎక్కువ రెవెన్యూ, ఎక్కువ స్వేచ్ఛ లభించే వేమో.. ఈ కొత్త వీడియోలను న్యూస్ 18 వాడుకుంటున్నది.. కొత్త తరహా అగ్రిమెంట్ కావచ్చు.
సరే లెక్కలన్నీ చూసుకునే చేరి ఉంటుందని ఓ వర్గం అంటున్నది. దాన్ని ఎలా వదిలేస్తే ఫస్ట్ న్యూస్ ఆనాలసిస్ బిబిసి మీద ఎక్కు పెట్టింది. వాంటేజ్ పేరిట… బిబిసి అనగానే ఎవ్వరూ ఏమీ అనొద్దన్నంత పవిత్రంగా వేరే మీడియా హౌస్ లు భయపడి పోయాయి. యాంటీ నేషన్ బిబిసి మీద విమర్శకు ఎందుకు సందేహించాలి? బిబిసి తిక్క వీడియోలను, విష ప్రచారాన్ని కాంగ్రెస్ వాడుకుంటుంది.. అది అందులోనే విభేదాలకు దారితీస్తోంది.. కాంగ్రెస్ సీనియర్ లీడర్ ఏకే ఆంటోనీ కొడుకు అనిల్ ఆంటోనీ తీవ్రంగా స్పందించాడు.. బీబీసీ చేసే ప్రచారాన్ని భారత సార్వభౌమాధికారం, ఆత్మభిమానం కోణాల్లో చూడాల్సి ఉండగా, ఆ దిక్కుమాలిన వీడియోలకు పార్టీ ప్రచారం కల్పించడం ఏంటని ప్రశ్నించాడు.. నిజం చెప్పాలంటే బిజెపిలోనే ఎవరికి ఇలా అటాక్ చేతకాలేదు.
ప్రస్తుతం కేరళ డిజిటల్ మీడియా సెల్ లో పనిచేస్తున్న అనిల్ ఆంటోనీ అల్లాటప్పా స్ట్రీట్ కార్యకర్త కాదు. స్టాన్ ఫర్డ్ యూనివర్సిటీలో ఎంఎస్ చేసిన అతను ఇప్పుడు యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో మేనేజ్మెంట్ స్కూల్ అడ్వైజర్ బోర్డు మెంబర్.. తను లేవనెత్తిన ప్రశ్నకు బదులు ఇవ్వలేక కాంగ్రెస్ తనను సస్పెండ్ చేసి, అర్జెంటుగా మరో వ్యక్తిని తన ప్లేసులో నియమించింది. ఇదిగో ఇలాంటి చర్యలే కాంగ్రెస్ పార్టీని మరింతగా జనంలో పలచన చేస్తూ ఉంటాయి.
పాల్ కి శర్మ వద్దకు వద్దాం.. అర్నబ్ కూ ఆమె కూ తేడా ఏమిటంటే…అర్నబ్ అరుస్తాడు, కరుస్తాడు, ఎగురుతాడు, ఆవేశపడతాడు.. తన సొంత భావాన్ని రుద్దే ప్రయత్నం చేస్తాడు.. కానీ పాల్కి అలా కాదు.. కూల్… ఎమోషనల్ అయిపోదు.. విషయం ఏమిటో అర్థమయ్యేట్టుగా వివరిద్దాం.. ప్రేక్షకులకు సొంత అభిప్రాయం ఏర్పరచుకునే అవకాశం ఇద్దాం అనేది ఆమె సూత్రం.. ఏ భావజాలాన్ని మెదడుకు రుద్దుకొని, ప్రతీ విషయాన్ని ప్రిజుడీస్ కోణంలో పరిశీలించే అపాత్రికేయమే రాజ్యం ఏలుతున్న వర్తమానంలో ఆమె ఎంత మేరకు స్వచ్ఛంగా ఉండగలదో వేచి చూడాలి. ఇక వాంటేజ్ పేరుతో పాల్కి శర్మ నిర్వహించిన డిబేట్ బి బి సి అసలు రూపాన్ని ప్రజల కళ్ళ ముందు ఉంచింది.. అంతేకాదు దాని లక్ష్యాలు ఏమిటో, ఏ లక్ష్యం కోసం పనిచేస్తుందో… కళ్ళకు కట్టింది.. దీంతో ఇండియాలో బీబీసీని బ్యాన్ చేయాలన్న డిమాండ్లు వ్యక్తం అవుతున్నాయి.. ఫర్ డిబేట్ సేక్ బిబిసి ని ఎలా టాకిల్ చేయాలో బిజెపి నాయకులకు చూపింది.
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: News presenter palki sharma upadhyay analyzed the bbc
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com