Bigg Boss Shanmukh and Deepthi
Bigg Boss Shanmukh and Deepthi: తెలుగు సోషల్ మీడియాలో ప్రేమ పక్షులుగా ‘దీప్తి సునైనా, షణ్ముఖ్ జస్వంత్’ ఓ రేంజ్ లో హల్ చల్ చేశారు. కానీ, సడెన్ గా ఇద్దరూ ప్రేమగా బ్రేకప్ చెప్పుకోవడంతో నిన్నటి నుంచి ఆ వార్త హాట్ టాపిక్ అయింది. పైగా 2022 మొదటి రోజే దీప్తి, షణ్ముఖ్ ఇలా తాము ఇద్దరం ఇక నుంచి ఎవరి దారిన వాళ్ళం పోతున్నాం అన్నట్టు సోషల్ మీడియాలో పబ్లిక్ గా మెసేజ్ లు చేసుకున్నారు.
Bigg Boss Shanmukh and Deepthi
అయితే, సింపుల్ గా ఎవరి దారులు వాళ్ళు చూసుకుంటున్నాం అని రాసేసుకుని విడిపోయారు. కానీ, అసలు ఈ ప్రేమ కథలో వచ్చిన సమస్య ఏమిటి ? అంటూ నెటిజన్లు చర్చ మొదలెట్టారు. ఆ చర్చలో తేలిన ముఖ్య అంశం ఏమిటంటే.. వీళ్ళ 5 ఏళ్ల లవ్ స్టోరీలో ఒక విలన్ ఉన్నారు అని ? ఆ విలన్ ఎవరు? అంటూ కామెంట్స్ మొదలయ్యాయి.
అయితే, బిగ్ బాస్ తెలుగు 5 షో చూసిన వారికి ఈ పాటికే అర్ధమైపోయే ఉంటుంది ఆ విలన్ ఎవరు అనేది. పేరు ‘సిరి హన్మంత్’. ఇప్పుడు దీప్తి సునైనా, షణ్ముఖ్ జస్వంత్ మధ్య జరిగిన బ్రేకప్ కథలో అందరి ఫింగర్స్ సిరి వైపే ఉన్నాయి. మరి నిజంగా సిరి వల్లే దీప్తి సునైనా, షణ్ముఖ్ జస్వంత్ మధ్య బ్రేకప్ జరిగిందా ? లేక, సిరిని బలి చేస్తున్నారా ?
Also Read: చక్కటి ప్రేమాయణంలో ‘బిగ్ బాస్’ చిచ్చు.. అక్కడే షణ్ముక్, దీప్తి రిలేషన్‌కు బ్రేకులు..!
నిజానికి సిరి – షణ్ముఖ్ మధ్య బిగ్ బాస్ వేదిక మీద కొంతవరకు ఘాటు ప్రేమాయణం నడిచింది. సరే, బిగ్ బాస్ కాబట్టి.. అందులో ఏది నిజం ? ఏది అబద్దం ? అనేది తెలియదు. కానీ, ప్రోగ్రాం అవతల కూడా ‘సిరి – షణ్ముఖ్’ మధ్య ఎఫైర్ వ్యవహారం అనేది ఉంది అని, అందుకే దీప్తి పాప షణ్ముఖ్ బాబుకు గుడ్ బాయ్ చెప్పింది అనే టాక్ బలంగా వినిపిస్తోంది.
కాకపోతే, సిరి మాత్రం అలాంటిదేమి లేదని వాదిస్తోంది. షణ్ముఖ్ మాత్రం నర్మగర్భంగా ఏదేదో చెబుతున్నాడు. మొత్తమ్మీద ‘బిగ్ బాస్ తెలుగు’ ఇప్పటివరకు 5 సీజన్లలో ఈ రేంజ్ బ్రేకప్ కథ ఎప్పుడూ జరగలేదు. తొలిసారిగా రొమాన్స్ వల్ల నిజ జీవితంలో ఒక జంటకి బ్రేకప్ జరిగింది.
Also Read: విడిపోతూ కూడా ప్రేమను కురిపించేస్తే ఎలా ?