‘కిసాన్ కల్యాణ్ మిషన్’ను ప్రారంభించిన యోగి
రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. రైతు సంక్షేమం, అభివృద్ధికి ఉద్దేశించిన ‘కిసాన్ కల్యాణ్ మిషన్’ను లక్నోలోని దదుపూర్ గ్రామంలో బుధవారంనాడు ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, గత ప్రభుత్వాలు రైతు సమస్యలపై ఉదాసీన వైఖరితో వ్యవహరించాయని ఆరోపించారు. గత ప్రభుత్వాల వైఖరి కారణంగా 2004 నుంచి 2014 వరకూ లక్షలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత […]
Written By:
, Updated On : January 6, 2021 / 07:40 PM IST

రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. రైతు సంక్షేమం, అభివృద్ధికి ఉద్దేశించిన ‘కిసాన్ కల్యాణ్ మిషన్’ను లక్నోలోని దదుపూర్ గ్రామంలో బుధవారంనాడు ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, గత ప్రభుత్వాలు రైతు సమస్యలపై ఉదాసీన వైఖరితో వ్యవహరించాయని ఆరోపించారు. గత ప్రభుత్వాల వైఖరి కారణంగా 2004 నుంచి 2014 వరకూ లక్షలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు నూతన సాంకేతికతను ఉపయోగించుకుని అభ్యుదయ పథంలో పయనిస్తున్నారని యోగి ఆదిత్యనాథ్ చెప్పారు.