
ఆస్ట్రేలియాలో జరుగుతున్న డైఅండ్ నైట్ టెస్ట్ లో భాగంగా భారత బౌలర్లు విజ్రుంభిస్తున్నారు. ఇప్పటికే ఆప్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన మాయాజాలంతో కీలక 3 వికెట్లు తీసుకున్నాడు. బుమ్రా రెండు వికెట్లు తీసుకున్నాడు. తాజాగా ఉమేశ్ ఒకే ఓవర్ లో రెండు వికెట్లు తీసుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇప్పటికే ఐదు వికెట్లు కోల్పొయిన ఆసీస్ తాజాగా ఉమేశ్ లబుషేన్ 47 పరుగుల వద్ద 54 వ ఓవర్ లో ఔటయ్యాడు. దీంతో ఆయనతో క్రీజ్ లో ఉన్న పాట్ కమిన్స్ డౌకట్ అయ్యాడు. దీంతో 55 ఓవర్లకు ఆసీస్ 7 వికెట్లకు 115 పరుగులు చేసింది. ప్రస్తుతం టిమ్ పైన్, మిచెల్ స్టార్క్ ఉన్నారు. అంతకుముందు 79 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. ఇక కెప్టెన్ కోహ్లి బ్యాటింగ్ లోనే కాదు ఫీల్డింగ్ లోనూ ఇరగదీస్తున్నాడు.కాగా భారత్ తొలి ఇన్నింగ్స్ లో 244 పరుగులు చేసి ఆల్ ఔట్ అయిన సంగతి తెలిసిందే.