
దేశంలో ఆదివారం పలు చోట్ల రహదారులు రక్తసిక్తమయ్యాయి. రెండు రాష్ట్రాల్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మొత్తం 12 మంది మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. బస్సు, ట్రక్కు ఢీకొన్న సంఘటనలో ఏడుగురు మృతి చెందగా 20 మంది గాయపడ్డారు. అస్సాంలోని కొక్రాజార్ జిల్లాలోని బొగ్రిబారి ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. గాయపడ్డవారిని చికిత్స కోసం ధుబురి మెడికల్ కళాశాలకు తరలించారు. అలాగే కర్ణాటకలోని చిత్రగుర్డా జిల్లాలోనూ ట్రక్కు, టెంపో ఢీకొట్టింది. ఈ సంఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఆరుగురికి గాయాలయ్యాయి. చిత్రగుర్డా జిల్లాలోని బిజేపల్లి హల్లి ప్రాంతంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. కాగా గాయపడ్డవారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.