
తమిళనాడు రాజధాని చైన్నైలోని ఓ ఫైవ్‌స్టార్ హోటల్‌లో తమిళ టీవీ నటి వీజే చిత్ర (28) ఆత్మహత్య చేసుకున్నారు. విజయ్ టీవీలో ప్రసారమయ్యే పాండియన్ స్టోర్స్ సిరీస్‌లో ముల్లా పాత్రను పోషించి ఎంతో పేరు తెచ్చుకుంది. 2013 లో పీపుల్స్ టెలివిజన్‌లో వాట్ ది లా సేస్‌పై వ్యాఖ్యాతగా టీవీ రంగంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత సన్ టీవీలో ప్రసారమైన లిటిల్ డాడీ, బిగ్ డాడీ సిరీస్‌లో నటించింది. సినిమాల్లో కూడా నటించిన చిత్ర టీవీలో డాన్స్ షోలో రాణించింది. ఆమెకు డ్యాన్స్‌కు పెద్ద ఎత్తున అభిమానులున్నారు. ఇదిలా ఉండగా.. ఇటీవల ఆమె వివాహం చేసుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి.