
ఒడిశా రాష్ట్రంలోని ఓ ఫ్యాక్టరీలో విషవాయువు లీకైంది. ఈ ప్రమాదంలో నలుగురు కార్మికులు మరణించారు. రాష్ట్రంలోని సుందర్ గఢ్ జిల్లా వుర్కెలా స్టీల్ ప్లాంటులోని కెమికల్ విభాగంలో గ్యాస్ లీకైనట్లు స్థానికులు తెలిపారు. ఈ వాయువును పీల్చిన నలుగురు కార్మికులు అక్కడికక్కడమే మరణించారు. మరికొంతమంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిని సమీప ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న రెస్క్యూ టీం స్టీల్ ప్లాంట్ వద్దకు చేరుకొని సహాయ కార్యక్రమాలు చేపట్టారు. గతంలో ఆంధ్రప్రదేశ్ లోని విశాఖలోని ఎల్జీ పాలిమర్స్లో ఇదే తరహాలో విష వాయువు లీకై పదుల సంఖ్యలో మరణించారు.